పుట:Andhrula Charitramu Part 2.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రోలరాజు కొడుకుచే జంపబడుట

         ఇట్లుచక్రపరాక్రమలీల శత్రురాజులను నిర్జించి త్రైలింగ్యసామ్రాజ్య నిర్మాణభవనమునకు బునాడు లేర్పఱించి జగతికేసరి యను బిరుదనామమును వహించి బహుకాలము పరిపాలనముచేస్న కాకతిప్రోలరాజుతుద కవసాన కాలము సమీపింప దురదృష్టవసమున నాకస్మికముగాదన ప్రియకుమారుండగు శ్రీరుద్రదేగ్ఫనృపునిచే బొడువంబడి చంపబడియను. ఇట్టి విషాదకరమైన హర్య కేవలము భ్రమప్రమాదవశమున దటస్థ మైనదిగాని తండ్రియెడ బ్రతాపరుద్రునకుం గల ద్వేషముచేట సంబవించింది కాదు. ఒకనాడు దేవాలయంబున బ్రతాపరుద్రదేవుడు గాధనిద్ర నున్నకాలమ్న దండ్రి యైన ప్రొలరాజు అతనిప్రక్కనుండిపోవుచు నతనిని స్పృశించెను. అంతటనతడు మేల్కొని శ్డత్రువెవ్వరో తన్ను ముట్టుకొనవచ్చెనని యాగ్రహమహోగ్రుడై లేచి మొలలోనున్నకైజాఱువెఱికి యొక్క పోటుపొడిచెను. అంతట్ తండ్రి నేలంబడ జూచి తెలివిగాంచి చేసినహత్యకు బశ్చత్తప్తుడై దు:ఖింపసాగెను. ఇది భ్రమప్రమాదవశమున దటస్థమైనదని యెఱింగినవాదు గావున బ్రోలరాజు కుమారుని శిక్షింపక యోదర్చి రాజముద్రిక నొసంగి రాజ్యము మొప్పగించి పరిపాలనముచేయ నాజ్ఞచేసి ప్రాణంబులను విడిచెను.
                                      ----=---