పుట:Andhrula Charitramu Part 2.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

      నిశ్శేషదోషారిఖండల్నచండకాణ్ణం
      రత్నత్రయప్రభవమద్యగుణైకతానం."

ఈపైశ్లోకమున నీతడు జనేంద్రుని బ్రస్తుతించియుండుటచేత నీతడు జైనమతావలంబకు డని స్పష్టముగా బోధపడుచున్నది. ప్రోలరాజుకొడుకయిన రుద్రదేవుడు వీరశైవమతానలంబకు డయినందున దనతండ్రినిగూడ శివపాదపద్మ యుగళధ్యానమృతానందుడని వక్కాణించియుండును గాని వేఱొండు గాదు. ఒకవేళ ప్రోలరాజు వార్ధకదశయందు శైవుడైన నైయుండవచ్చును.

                     ప్రోలరాజు సంతానము

ప్రోలరాజునకు ముప్పమ యనుభార్యగలదు. ఆమె యనుమకొండశాసనము నందీక్రిందివిధమున నభివర్ణింపబదినది.

           "దేవీముప్పమనామధేయసహితా యస్వా గుణాస్తారకా:
            కీర్తిశ్శారదచంద్రైకేన విటన త్కాంతేస్తు నైవోపమా
            కౌసల్యేన చ జానకీవ చ సతీ కుంతీవ పద్మా చ సా
           పౌలొమీవ వ వండేఇకేన చ తధా తస్యాభవర్భామినీ."

ఈపైశ్లోకమునందు ముప్పమదేవి సుగుణంబులు నక్షత్రంబులవలెను, కీర్తి శరత్కాలచంద్రికవలెను బ్రకాశించుదున్నదనియు, మఱియు నామె కౌసల్య, జానకి, కుంతి, పద్మ, పౌలోమి, చండికా మొదలగువారం బోలియున్నదని మాత్రము వర్ణీంపబడియెనేగాని యామె యేవంశమునం దేవరాజునకు జనియించెనో తెలుపబడియుండనందున ముప్పమ దేవియొక్క తలిదండ్రులను గూర్రి మనకేమియు దెలియరాకున్నది. ఈమెకు ప్రొలరాజువలన రుద్రదేవుడు, మహాదేవుడు మొదలగు నైదుగురుపుత్రులు జనించి యశస్వంతులైరి. ఈప్రకారము కాకతిప్రోలరాజు సంతానమును ప్రాభవమును బడసి అరక్రపరాక్రముడై చాళుక్యచక్రవర్తుల సైన్యాధిపతులను పెక్కుండ్రు మాండలికరాజులను జయించి రాజ్యమును విస్తరింపజెసి మొట్టమొదట శ్తైలింగ్య సామ్రాజ్యనిర్మాణభవనమునకుం బునాడు లెర్పరించెను.