పుట:Andhrula Charitramu Part 2.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆఱవ ప్రకరణము

                             ----
                 కా క తీ యాం ధ్రు లు.
                                   ---- ---
                     శ్రీ రు ద్ర దే వ మ హా రాజు.
               (క్రీ.శ. 1140 మొదలుకొని 1196 వఱకు)
         కాకతిప్రొలరాజునకు బిమ్మట నతని పెద్దకుమారుడైన రుద్రదేవుడు పట్టాభిషిక్తు డయ్యెను గాని యెప్పటినుండి యాతని పరిపాలనము పారంభమయ్యెనో స్పష్టముగా దెలిసికౌనుట కాధారము గానిపించలేదు. భావి పరిశోధనమున సత్యం తేటపడునంతదనుక క్రీ.శ. 1140 దవ సంవత్సరమునకు గొంచె మీవలగాని యూవలగాని రుద్రదేవుని పరిపాలనము ప్రారంభమై యుండునని చెప్పవచ్చును. ఈరుద్రదేవులదే చరిత్రమున మొదటిప్రతాపరుద్రుడు డని పేర్కొనబడుచున్నాడు. ఇతడు పరాక్రమమునందు తండ్రినిసయితము మించినవాడై అధికసాధ్యముతో నత డేర్పరించిన పునాదులపై ద్రైలింగ్యసామ్రాజ్యభవననిర్మాణమును గావించి సుస్థిర మైన యశమును సంపాదించెను. ఇతని చరిత్రమును సంపూర్ణముగా, దెలిసికొనుటకు జాలినన్ని సాధనములు గానరావు గాని కొంత చరిత్రమును దెలిసికొనుటకు నతని శాసనములు రెండుమూడుమాత్రము తోడ్పడుచున్నవి.  అందనుమకొండ శాసనము ప్రధాన మైనది. ఇయ్యది శా. శ. 1024 వ సంవత్సరమునందనగా క్రీ.శ. 1162 వ సంవత్సరమున రుద్రదేవునిచేతనే వ్రాయింపబదిన ప్రధానశాసనముగా నున్నది.  ఈశాసనమునందు రుద్రదేవుడు తన తాతయైన త్రిభువనమల్లునకు బూర్వమునందుండినతన వంశపురుషుల నెవ్వరిని బేర్కొని యుండలేదు.  తనతండ్రియు దానును జయించిన రాజులన్ గొంద