పుట:Andhrula Charitramu Part 2.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజయిన విష్ణువర్ధను డభినందింప బడియెను. అయినను జగద్దేవుడు శా.శ. 1071 (క్రీ.శ.1142) వ సంవత్సరమున "సేతు" అనెడి ప్రదేశమున బరిపాలనము సేయుచు బుల్లిగ్రామమునకు విచ్చేసి కొందనాటిలోని కుందూరుగ్రామమును దానముచేసియున్నాడు. అశ్చిమచాళుక్యచక్రవర్తి యైన రెండవజగదేక మల్లుని పరిపాలనసంవత్సములలో 13 సగియగు శుక్లసంవత్సరమున బైశాసనము పుట్టి యుండుటచేతను, చాళుక్యచక్రవర్తుచే వహింప బడుచుండిన త్రిభువనమల్ల యనుఇరుదనామమును వహించియుండుటచేతను, ఇతడు మొదట త్రిభువనమల్ల విక్రమాదిత్య చక్రవర్తికిని, అటుపిమ్మట రెండవ జగదేకమల్లునకును, సామంతుడుగ నుండె నని వేద్య్హమగుచున్నది. అందుచేతనే యితటు తైలపదేవుడు కాకతిప్రోలరాజుచే బట్టువడి పరిభవింప బడి విడిచిపట్టబడిన తరువాత ప్రభుపక్షమునుబూని ప్రోలరాజును రక్షించుటకై అనుమకొండపై దాడి వెడలివచ్చి యుద్ధముచేసి యోడిపోగా బ్రోలరాజుచే దఱుమగొట్టబడియుందు నని సులభముగా బోధపడుచున్నది.

                    కాకతిప్రోలరాజు మతము.
   శ్రీరుద్రదేవుని యనుమకొందశాసనమునందు ప్రోలరాజు "శివపాదచ్ పద్మయుగళ ధ్యానామృతానందు డ"ని యీక్రిందిశ్లోకమున జెప్పబడినది.

     "తత్పుత్త్ర:శివసాదపద్మయుగళద్యానామృతానంద భూ
       డ్లుంరాకోరిపుసుందరీజనమహా సౌభాగ్యసంపచ్చ్రియ:
       ప్రోలీరాజ ఇతి ప్రసిద్ధముగ మద్వైరీంద్రడర్పాపహా
      నిశ్శంకప్రణ్భవప్రబంధనమహాహంకారలంకేశ్వర:"

ఈ పైశ్లోకమున ప్రోలరాజు శివభక్తు డని తెలుపబడియున్నను, పద్మాక్షీ దేవాలయమున ప్రోలరాజుచే నెలకొలుపబడిన శాసనములొ మొట్టమొదట నీక్రింది శ్లోకముచే జినేందుడు గీర్తింపబదియను.

     శ్రీ మజ్జినేంద్రపదపద్మమశేష భవ్యం
     నన్యత్రిలోక నృపతీంద్రము వీంద్రనలద్యంఅ