పుట:Andhrula Charitramu Part 2.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోని మంతేనగ్రామ మని మఱికొందఱును తలంచుచున్నారు. కొత్తపల్లిసీమకు బరిపాలకుడయిన గొవిందరాజు మొదలగుగారితో యుద్ధము జేసి జయించిన వాడగుటచేత బ్రోలరాజుకృష్ణామండలములోని మాండలిక ప్రభువులను జయించుటకై ప్రయత్నించియుండును గావున, మంత్రకూట మనునది మంతెన గ్రామమే యైయుండు నని నిర్ధారింపవచ్చును.

                 ప్రోలరాజు జగద్దేవుని బాఱద్రోలుట.
   అనుమకొండశాసనమునందే బుద్దేవు డనురాజు ప్రోలరాజుపై దండెత్తివచ్చి యనుమకొందను ముట్టడింపగా నాతనిజయించి తఱిమెనని యీ క్రిందిశ్లోకమున జెప్పబదినది.

    "అన్యచ్చానౌమకొండనామనగగీం సంవేస్ట్యయోయం స్థితో
     నానామండలికాంవితో భువి జగద్దేస్యదేవప్రభు:
     స్తబ్ధస్తంభిత ఏన కార్యకరణే శక్తంక్షణా న్నిర్గత:
     శ్రీమత్ప్రోలనృపస్యతిస్య జయిన: కింబ్రూమహేగౌరవమ్,"

ఈపైశ్లోకమునం బేర్కొనంబడిన జగద్దేవుడు పట్టిపాంబుచ్చపురాధీశులయున సంతారరాజులలో నొక్కడగు మహామండలేశ్వర త్రిభువవల్లజగద్దేవుడనికాని యన్యుడుగాడు. పట్టిపాంబుచ్చపురము నెడు మైసూరు రాష్త్రములో నగరమందలములోని హంచ యనుపేరం బరగు చున్నది. ఈ జగద్దేవునితల్లి బిజ్జలదేవి ; బిజ్జలదేవి చెల్ల లగు చట్టలదేవి గొవాకదంబులలో మొదటి విజయాదిత్యున కిచ్చి వివాహము చేయబడియెను. (శా.శ.1020) ఇతడు వయస్సుమీఱక యున్నకాలమున బల్లాలరాజులచే నదిమపెట్టబడి యుండెను. మదటిబల్లాలరాజు జగద్దేవునిరాష్ట్రమును బాడుచేసె నని గడుగుశాసనముల వలన దెలియుచున్నది.1 శా.శ. 1032 దవ సంవత్సరములో నేర్పడిన బేలూరుశాసనములలో నొకదానిలో జగద్దేవుని బలమును హరించుటయందు భైరవునివంటివా డని హోసంబల్లాం


1. Indian Antiquary, Vol.II. Page 301