పుట:Andhrula Charitramu Part 2.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుండలేదు చేబ్రోలుశాసనములొ దుర్జయుని తరువాత బెతరాజు పేర్కొనబది యుండెను. నీనినన్నిటిని పరిశీలించిచూడగా నీక్రిందివిధమున గాకతీయ వంశావళిని బేర్కొనవచ్చును. దుర్జయుని తరువాత కాకతీయవంశమునందు మొదటిప్రోలరాజ్ జనించెను. ఇతడు కేసరి యనునొకగొప్ప చెఱువును ద్రవ్వించెను. ఇతనికి త్రిభువనమల్లబెతరాజు జనించెను. త్రిభువనమల్లడనునది బెతరాజునకు బిరుదనామము. ఈబేతరాజు మొదట నాంధ్రదేశమునందొక చిన్న భాగమున కధిపతియై యుండి చాళుక్యాభరణుండును, సతాశ్రయకులతిల కుండును నైన యాజనవిక్రమాదిత్యచక్రవర్తికి సామంతుడై త్రిభువనమల్లదేవుడను విక్రమాదిత్యుని బిరుద నామమునె తానును వహించెను. ఈబేతరాజునకు వ్యోజరండాధినాధుడు మంత్రిగనుండెను. ఈదండనాధుని కీమంత్రిపదవి వంశ క్రమానుగతముగా లభిచినది. ఈమహాప్రధాని తన ప్రభు వయిన మాండలికకాకతి బేతరాజున్ గొనిపోయి శ్రీతిభువనమల్లదేవవిక్రమాదిత్యచక్రవర్తికి మ్రొక్కించి యాచక్రవర్తికి సామంతమండలేశ్వరుడుగ నుండి సబ్బిసాయిరమండలమును బరిపాలించునట్లుగ నియోగింపజేసెను.1 అనుమకొండ రాజధానిగంజేసికొని మహా మండలేశ్వరకకతిబెతరాజు వ్యోజదండాధినాధుడు మహాప్రధానిగ సబ్బిసాయిత మండలమును బ్రిరిపాలనముచేసి ప్రసిద్ధిగాంచెను.

పశ్చిమచాళుక్యచక్రవర్తి యైన యాఱవవిక్రమాదిత్యుడు క్రీస్తుశకము 1076 మొదలుకొని 1126 వఱకు రాజ్యభారమును నిర్వహించినవాడు గావున నతని సామంతమాండలికు డయిన బెతరాజ్ అదునొకండవశతాబ్ధఆంతమునందు నాంధ్రదేశములోని సబ్బిసాయిరమందలమ్ను బరిపాలించెను. ఇతడు జైనమతా భిమానియై జైనులను బోషించెను. మఱియు నితడు కాకతి


1.క్రీ.శ. 971 వ సంవత్స్దరమునబశ్చిమగాంగుడయిన పాంచాలదేవునిచే బాలింపబడిన సెబ్బిమండలమదిగాదని తోచుచున్నది. అది ధార్వాడమండల ములోని హుబ్లీతాలూకాలోని ఎతబ్బి యను గ్రామమునుబట్టి యేర్పడి యుండవచ్చును.