పుట:Andhrula Charitramu Part 2.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యను జైనుదేవతను బూజించుటచే నీశని సంతతివారికెల్లరకును కాకతీయులని పేరు కలిగినది. ఇంతకంటె నీతనిగూర్చి చెప్పగలిగినది మఱియేమియున్ గానరాదు.

                   మహామండలేశ్వర కాకటి ప్రోలరాజు
    మహామండలేశ్వర కాకతి బేతరాజునకు బిమ్మట రాజ్యభారమును వహించిన వాడతనికుమారు డైనప్రోలరాజు. ఇతడు రాజ్యతంత్రజ్ఞడయిన మహాయోధుడు. ఈ మహాయోధుడు తండ్రిమరణానంతరం రాజ్య భారమ్న్ బూని పశ్చిమచాళుక్యచక్ర వర్తి యగు నాఱవవిక్రమాదిత్యునికి సామంతమాందలికుడై యాతనిమహాప్రధాను లలో నొకడు గానుండి యాచక్రవర్తి లోకాంతగతుడైన పిమ్మట స్వతంత్ర్డై త్రైలింగ్య సామ్రాజ్యము నిర్మించుటకై పునాదు లేర్పఱుప బ్రయత్నించుచుండెను. ఇతని శాసనమొకటి యనుమకొండ్లోని పద్మక్షీదేవాలయుమున గానబడుచున్నది. ఈ శాసనమునుబట్టి  శ్రీమన్మహామండలేశ్వర్ కాకత్ ప్రోలరాజుచరొత్రము కొంతవఱకు దెలియుచున్నది.  ఈకాకతిప్రోలరాజుశాసనమునందు మొదట త్రిమూర్తులయిన బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో నెవ్వరినిస్తుతింపక శ్రీమజ్జినేంద్రుని మాత్రమే స్తుతించి యుండుటచేత నితడు జైనమతావలంబి యని స్పష్టముగ బోధపడుచున్నది. ఇతడుమాత్రమే గాక యీప్రోలరాజు మంత్రియైన బేతరానప్రగ్గడయు నతని భార్యయు జైనమతావలబకులనికూడ తేటపడుచున్నది. ఈబేతంప్రెగ్గడ కాకతి బెతరాజుమంత్రి యైన వ్యోబదండాధి నాధునకు యాకమాంబికయందు జనించినవాడు.
                           పద్మాక్షీదేవి యాలయము
     నైజామురాష్ట్రములోని హనుమకొండకు దక్షిణభాగమునందున్న యొక చిన్నకొండపైని పద్మాక్షీదేవాలయము నిర్మింపబడినది.  ఈ కొండప్రక్కను ఈ దేవతాలయమున కెదుట్న్ జైనవిగ్రహములు గలవు. ఈ యాలయ

1. Epigraphia Indica, Vol. ix, Page 256 No.35