పుట:Andhrula Charitramu Part 2.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేశాసనమునందును గాకతీయులు తాము సూర్యచ్వంశజులమనికాని చంద్రవంశ జులమనికాని వ్రాసికొని యుండలేదు. ఇంతియగాక గణపతిదేవునికి బూర్వపు శాసనములలో దుర్జయుడు వారి పూర్వులలోనివాడుగ జెప్పబడియుండలెదు. మఱియును గణపతిదేవరాయనికాలమునాటి సౌఖాలశాసనములో గలికాలచోడు డీకాకతీయులకు బూర్వుదని చెప్పబదినదిగాని యీశాసనము కేవలము గణపతిదేవునిశాసనముగాక యతనిసేనాధిపతి యగు బయ్యన నాయకుని పుత్రుడగు జగదాళముమ్మడినాయకునిశాసన మగుటవలన నందలి సంబంధము లంతగా బాటింపబడదగినవి కావు. కాకతీయగణపతిరాజు చక్ర వర్తి పదమును వహించినతరువాత నాతని ఘనత నిరూపించుటకై యతడు సూర్వ వంశజుం డని కల్పింపబది శ్లాఘింపబడినది. విద్యానాధమహాకవి తన ప్రతాప రుద్రీయమున గాకతీయులను సూర్యవంస్పురాజులనికాని చంద్రవంశపురాజులని కాని వర్ణింపక రెంటి నతిశయించినవారని వర్ణించుటయు, తనది సూర్యవంశ మని చెప్పుకొనిన గణపతిచక్రవర్తి చతుర్ధాన్వయులతోడ సంబంధము చేసి యుండుటయు, పైవర్ణనలన్నియు నతిశయోక్తులని వేనోళ్ల జాటుచున్నవి. కాకతీయులచరిత్రమునందు మొట్టమొదట బేర్కొనబడదగినగాడు త్రిభువనమల్ల కాకతీబేతరాజు గుంటూరుమండలములోని చేబ్రోలు శాసనమునం దొకదానిలో బేతరాజు దుర్జయుని తరువాత బేర్కొనబడియెను. నైజామురాష్ట్రములోని పాఖాలశాసనములో దుర్హయుడు ప్రోలరాజుతండ్రియని వ్రాయబడినది. కాకతీయ వంశవృక్షమందలి చిక్కును విడదీయుట కొక సాధనము గలదు. కాకతీయ గణపతిదేవునియొక్క గుంటూరు మండలములోని మోటుపల్లి శాసనములో గాకతీయవంశవృక్ష మీయబడినది. అందు సూర్యుడు మొదలుకొని గణపతిదేవునివఱకు గల రాజులు పేర్కొనది దూర్జయునకును త్రిభువనమల్ల బేతరాజునకును నడుమ మొదటి ప్రోలరాజని యొక క్తొత్తనామముగూడ నీయ బడినది. పాఖాలశాసన మునందీప్రోలరాజు దుర్జయునికొడుకని చప్పి యతని వంశమున రుద్రదేవుడు జనించెనని వక్కణించుచున్నది గాని రుద్రదేవుడు ప్రోలరాజుకొడు కని నుడివి