పుట:Andhrula Charitramu Part 2.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


బలవంతులై వారల యధికారమును బోద్రోచి త్రైలింగ్యసాంరాజ్యసంస్థాపకులై వన్నెయు వాసియు గాంచి యించుమించుగా మూడుశతాబ్దములు పరిపాలనము చేసి శాశ్వతయశంబు గాంచిరి. ఈప్రభువులు కాకతి యను దేవతను గొల్చుచుండువారౌ గావున వీరికి గాకతీయు లను పేరు గలిగినట్లు గాన బడుచున్నది. కాకతి యను నామము దుర్గయొక్క నామాంతర మని మహా మహోపధ్యాయ కోలచల మల్లినాధసూరి గారి పుత్రుండగు కుమార స్రామిసోమ యాజిగారిచే బేర్కొనంబడియెనుగాని కాకతీయులపూర్వులు జైనమతావలంబకు లగుటచేత గాకతి యనునది జైనదేవతలలో నొకదాని నామమముగా నూహింప వలయును.

            కాకతీయులు సూర్వవంశజులు.
   కాకతీయులు చంద్రవంశరాజులనియు మాధవవర్మ సంతతివారనియు స్థానిక చరిత్రమునందును, కాసె సర్వస్వప్రణీత మగు సిద్ధేశ్వరచరిత్ర మను నామాంతరముగల ప్రతాపచరిత్రేమునందును, దీనిని బట్టి కూచిమంచి జగ్గకవిచే వ్రాయబడిన సోమదేవరాజీయమునందును వ్రాయబడియెను గాని కాకతీయులు సూర్యవంశజులయినటులు గాకతీయుల శాసనములందుగాని, మొదటి ప్రతాప రుద్రుని శాసనములందుగాని సూర్యచంద్ర వంశముల ప్రశంస లేకపోయినను గణపతి దేవుని కాలమునాటి శాసనములయందు గాకతీయులు సూర్యవంశజు లని చెప్పబడిరి. వారి పూర్వులలో ఇక్ష్వాకువు, రఘువు, రాముడు మొదలగు వారి నామములు పేర్కొనబడినవి. ప్రతాపరుద్రీయ మనునలంకార శాస్త్రమును రచించిన విద్యానాధ మహాకవి సూర్యవంశమనికాని చంద్రవంశమనికాని చెప్పక "అక్యర్కేడుకులప్రశస్తిమస్పజద్యం కాకతీయాంవయమ్" అని రెంది నతిశయించిన కాకతీయాన్యమ మని చెప్పియున్నాడు. శ్రీదౌర్వాసదేవీ పురాణ మనియెడు కమ్రనాయకుల చరిత్రమున జంద్రవంశమున గత్రురాజు జనించెననియు, అతని సంతతియే కమ్మవారయిరనియు, ఆకమ్రరాజ వంశముననే