పుట:Andhrula Charitramu Part 2.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ యి ద వ ప్ర క ర ణ ము

                             ----
                కా క తీ యాం ధ్రు లు.
                 త్రైలింగ్య సామ్రాజ్యనిర్మాణము

పశ్చిమచాళుక్యచక్రవర్తులు త్రిలింగదేశముయొక్క పశ్చిమ భాగ్ఫమును జయించి పరిపాలించుచుండిరి. మొదలుకొని మాధవవర్మవంశస్థులయిన వా రాచాళుక్యచక్రవర్తులకు సామంతమండలేశ్వరులుగ నుండి పరిపాలనము సేయుచుండి రని యూహింపవలయును నేగాని వారలు స్వతంత్ర పరిపాలనము సేయుచుండి రని యెంతమాత్రమును దలంప నాధారము గానిపించదు. ఏది యెట్టు లున్నను పదునొకండవశతాబ్దమునందు త్రిలింగదేశములోని పశ్చిమచ్ భాగము పశ్చిమచాళక్యచక్రవర్తులు స్వాధీనమున నుండె ననుటకు లేశ మాత్రమును సందియము లేదు. పశ్చిమచాళుక్యచక్రవర్తియగు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు శాలివాహనశకము 992 నళ సంవత్సరమం దనగా క్రీ.శ. 1042 పరాభవసంవత్సరంకు వఱకు ననగా క్రీ.శ. 1124 వఱకు అవపక్రరాక్రముడై ప్రజాపరిపాలనము చేసెను. ఈ త్రిభువనమల్లవిక్రమాదిత్యుని కర్ణాటభాషా శాసనములు త్రిలింగ్తదేశముయొక్క పశ్చిమభాగమ్నం దనేకములు గానం బడుచున్నవి. అప్పుడీభాగమంతయు వివిధభాగములుగ నేర్పడి వేర్వేఱు మండ లాధిపతులచే బరిపాలనము సేయంబడుచుండెను. ఆమండలాధిపతులలో కాకతీయు లొకరుగా నుండిరి. వీరు మొట్టమొదట వీరులుగానుండి మహారాజులకడ నధికార పదవులు సంపాదించి మండలాధిపతులై ఛాళుక్యచక్ర వర్తులకు సేనాధిపతులు మంత్రులై వారలకు గప్పము చెల్లించుచు గొంతకాలము గడిప్ క్రమక్రమముగా