పుట:Andhrula Charitramu Part 2.pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


కాకతీయప్రతాపరుద్రుడు జనించెననియు సత్యద్భతముగా వ్రాయబడినిది గాని, యది కల్పితగ్రంధమగుటచేత విశ్వసింపదగినది కాదు. గణపతిదేవ చక్రవర్తి శాసనములలో సూర్వవంశపురాజులను బేర్కొనుచు వారల వంశమునందు కరికాలచోడుడును, వారివంశమునందు గాకతీయులును జనించిరని స్పష్టముగా దెలుపబడియుండగా కమ్రనాయకుల చరిత్రములోని గాధ లెట్లు విశ్వసింప దగినవో యెంతమాత్రమును బోధపడకున్నది.

          దుర్జయ కులము.
  ఆగణపతిదేవరాయని శాసనములయందే సూర్యవంశమున మునుపు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంసమున గరికాలచోడుడు అతని వంశమున దుర్జయుడు, అతంబి వంశమున త్రిభువమల్లు కాకతి బేతరాజును జనించె ననియును; దుర్జయుడు కాకతీయులకు బూర్వుదనియును జెప్పబడియున్నది. కొంతకాల చాళుక్యచోడ చక్రవర్తులకున్, మఱికొంతకాలము కాకతీయాంధ్రచక్రవర్తులకును సామంతమండ లెశ్వరులుగ నుండి గుంటూరు, కృష్ణా మండలములలో బరిపాలనము సేయుచుండిన రాజులు కొందఱు తాముదుర్జయవంశస్థుల మని వ్యవహరించిరి. బుద్ధవర్మ సంతతివాడై శూద్రులయిన వెలనాటి చోడులతో సంబంధ బాంధవ్యములు కలిగియుండిన కొండపడమటి బుద్ధరాజు దుర్జయ కులస్తుడు. కులోత్తుంగచోడచక్రచ్వర్త్రికిని విక్రమచోడునకును సామంతుడుగ వుండిన మహామండలేశ్వరి నంబయరాజు దుర్జయకులస్థుడు. కాకతీయ చక్రవర్తులకు సామంటులుగనుండి గుడిమెట్ట రాజధానిగా నతనాటిసీమను బరిపాలించిన చాగి పోతరాజు దుర్జయకులస్థుడు. మఱియు దుర్జయకులస్థుల మని చెప్పుకొన్నవా ర నేకులు గలరు.
   కాకతీయులు మొదట రెడ్లు, తరువాత కమ్మవారు.
  కాకతీయులు కేవలము బాహుబలమువలన రాజ్యాధిపత్యము వహించి జనరంజకముగా బరిపాలనంచేసి మహారాజు లనిపించుకొన్న రెడ్డి కమ్మ