పుట:Andhrula Charitramu Part 2.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 సంవత్సరములును బరిపాలనము చేసిరని చెప్పబడియున్నది. ఈరాజులను గూర్చి విశేషచరిత్రాంశము లేవియు స్థానిక చరిత్రమునం జెప్పబడి యుండలేదు. ఈరాజులపరిపాలన సంవత్సరము లంతగా విశ్వసింపదగినవి కావ్. ఈరాజులు కటక పురాధీశ్వరునితో బోరాడుచుందినటుల స్థానిక చరిత్రమునందు వ్రాయబడి యున్నది. ఈమహారాజులలో భువనైకమల్లుడు ప్రఖ్యాతుడుగ గన్పట్టుచున్నాడు. ఇతడ్ విజయనతరెపురాజయిన నరసింహదేవరాయలతో యుద్ధము చేసినటుల జెప్పబాదియెనుగాని యాకాలమునకు విజూయనగరము నిర్మింపబడకుండుటయు, నరసింహదేవరాయ లాకాలమువాదు గాకుండుటయు వాస్తములయిన చరిత్రాంశములు గావున బైగాధల లోని విషయముల నెంతమాత్రమును విశ్వసింపరాదు.

                              నిజమైన చరిత్రము
     క్రీస్తుశకము 230 మొదలుకొని కీ.శ. 106 వఱకు నిజమైన చరిత్రము వివరముగా దెలియుసాధనములు లేవుగాని కొన్నిశాసనములనుబట్టి యీ దేశము 5 వ శతాబ్ధమున బశ్చిమచాళుక్యులకును, తరువాత రాష్ట్రకూటులకును, ఆతుపిమ్మట మరల బశ్చిమచాళుక్యులకును వశమై పరి పాలింపబడియెనని తేటపడుచున్నది. పశ్చిమచాళుక్యచక్రవర్తియైన పృధ్వీవల్లభ మహాఆజు 7 వ శతాబ్దప్రారంభమున నీదేశమును జయించెను. శృపృద్జ్వీవల్లభ మహారాజూధిరాజ పరమెశ్వరపరమభట్టారకపాదపద్మోపజీవి నని చెప్పుకొన్న భీమరాజును నొక రాజుయొక్క యసంపూర్ణశాసన మొకటి యోరుగంటియందు గానబడుచున్నది గావున మఱికొన్ని శాసనమ్లనుబట్టియును నీదేశమున్ 5 వ శతాబ్ధమునుండి 2 వ శతాబ్దమౌవఱకు పశ్ఫిమచాళుక్యులును, 10 దవ దశాబ్దాంతమువఱకు రాష్ట్రకూటులును, తరువాత బదునొకొండవశతాబ్దమధ్యము వఱకు మరల బశ్చిమచాళుక్యులును, అటుపిమ్మట గాకతీయులు నీదేశామును ంబరిపాలించినటుల జరిత్రమునుబట్టి తెలియుచున్నది.
                                  -------