పుట:Andhrula Charitramu Part 2.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంవవత్సరప్రాంతమున నొకమాధవవర్మ యనురాజు కలడనియు, అతని కుమారుడు చింతగింజల నమ్ముకొని పొట్టపోసికొనెడి యుఒక స్త్రీయొక్క బిడ్దను సంహరించినందున రాజు విచారించి తనకొడుకుమీద నేరము ఋజువైనందున న్యాయపక్షమునెపూని కొడుకునకు నురిశిక్ష విధించె ననియు, అందుపైని మల్లేశ్వరస్వామి యాతని న్యాయబుద్ధికి సంతోషించి యాతనిపై సువర్ణవర్షమును గురిపించి యాతనిపుత్రుని బీదరాలగు నాస్త్రీయొక్క పుత్రుని మరల సజీవులను గావించెననియు, మల్లేశ్వరుడు మాధవవర్మయొక్క కీర్తిని భూమిపై స్థాపితము చేసెననియు, నీమొదలు గాగలవిషయములు పేర్కొనభడినవి.1 కాబట్టి మాధవవర్మ ఖ్యాతి యప్పటికే ప్రఖ్యాతమై యున్నది. ఈమాధవవర్మ చరిత్రమునం గొంతకల్పన ముండినను మాధవవర్మ కల్పితపురుషు డని మాత్రము చెప్ప వలనుగాదు. ఇయ్యవి భావిపరిశోధనమునుగాని తేటపడునట్టి విషయములు కావు.

                       మఱికొందఱు చంద్రవంశపురాజులు
   మాధవవర్మకు పిమ్మట బద్మసేనుడు రాజ్యభారమును వహించి శా.క.464 సంవత్సరమువఱకు ననగా 74 సంవాత్సరములును, అటుపిమ్మట వానికొడుకు వెన్నమరాజు శా.శ.437 వఱకు ననగా 74  సంవత్సరములును, అనంతరము వానికుమారుడు పోరంకివ్వెన్నమరాజు శా.శ. 610 వఱకు ననగా 74  సంవత్సరములును, తదనంతరము వానిపుత్రుడు వెండిగుండమ రాజు శా.శ. 622 వఱకు ననగా 70 సంవత్సరములును, ఆమెతరువాత నెఱుసుదేవరాజు శా.శ. 767  వఱకుననగా 70 సంవత్సరములును, ఎఱుకదేవరాజునకు తరువాత భువనైకమల్లుడు శా.శ. 234 వఱకు ననగా

1. Report on Epigraphy No.665, Public, 28th July, 1810, Part II, Pages 81-82, Paras 8 and 9.