పుట:Andhrula Charitramu Part 2.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లును పొగడ్తలును దేశమున్ందంతట వ్యాపుంపగా దేశములోని శూరులందరు నస్తనికడకేగి కటకరాజుతోడి యుద్చమినకు బురికొల్పి సమరోన్ముఖుని గావించిరి. అప్పుడు మాధవవర్మ తల్లియొక్కయు, మాధవశర్మయొక్కయు ఇతర బ్రాహ్మణులయొక్కయు ననుజ్ఞంగైకొని బహుసైన్యములను గూర్చుకొని మొట్టమొదట నాపట్టణమేలుచున్నట్టి యెఱుకరాజును మరియొక ప్రదేశమునకుపంపి యనుమకొండను స్వాధీనపఱుచుకొని దోర్ధన్నమున నుద్దవిడి మత్కలముపై దండెత్తిపోయి కటకపురిని ముట్టడించెను. కటకపురాధీశ్వరుండును మేటిపరాక్రమ వంతుడేగావున జంకులేక ధైర్యసాహసములతో యుద్ధసన్నద్దుడై మాధవవర్మ నెదుర్కొనియును, మాధవవర్మ కటకదుర్గమును ముప్పది దినములు ముట్టడించి కోటలనుద్రవ్వి, కవాటంబులనువిఱిచి, కుడ్యంబులిడియగొట్టి, పట్టణంబుజొచ్చి సౌధంబులను గూల్చి, సకలసైన్యంబులును సమయించి, వీరరసంబు పొంచిరివోయి పొరలిపాఱు, సంకులసమరంబున జంద్రాయుధముచే గటకవల్లభుని తలద్రుంచి, పట్టణంబంతయు వశముచేసికొని, కటకపురాధీశ్వరుని కుమారునకు బట్టముగట్టి, హతశెషమయిన సైన్యముతో ననుమకోండకు మహావైభవముతో విచ్చేసి, తల్లికిని మస్ధవశర్మకును నమస్కరించి, యాశీర్వాదములను గాంచెను. పిమ్మట మాధవశర్మ దుర్మార్గులను శిక్షించుచు బ్రాహ్మణుల కనేకాగ్రహారంబులొసంగి ప్రజారంజకముగా బరిపాలనముసేయుచుండెను. అతనికి బట్టమహిషియందు బర్మాక్షీదేవి వరప్రసాదంబున గొంతకాలంబునకు సుతుండుకలుగగా నాబాలునకు బద్మసేనుండని నామముంచెను. ఈమాధవశర్మ శాలివాహనశకము230 దవ సంవత్సరము మొదలుకొని320 వది సంవత్సరము వరకు బరిపాలనముచేసెనని స్థానిక చరిత్రమునం జెప్పబడినది. పండ్రెడవ శతాబ్దమునందు వేగీదేశాధీశ్వరునకు సామంతుడుగనుండి పల్లకేతభూపాలుడు బెజవాడ మల్లేశ్వరస్వామివారి యాలయములో నొకఱాతిపలకమీద వ్రాయించిన శాసనములో నుదాహరింపబడిన గాధలలో శాలివాహనశకము112 న