పుట:Andhrula Charitramu Part 2.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వల్లభుడు చూచుచుండగా సిరియాలదేవిచే నృతమున్ లవణమును గ్రహించి భుజియించిరి. అందుకునకు కటకరాజు సంతసించి సిరియాలదేవిని బ్రాహ్మణులకు విడిచిపట్టి నిజసైన్యములతో గందారంబునుండి వెలువది స్వదేశమునకు పోయెను.

                             మాధవ వర్మ
   ఇక్కడ అనుమకొండలో నొక్కనాడు సిరియాలదేవి యెడ శుభ ముహూర్తమున నొక పురుషశిశువున్ బ్రసవించెన్. అప్పుడు దైవజ్ఞశిఖామణు లయిన బ్రాహ్మణోత్తములు పెక్కండ్రు మాధవశర్మగృహంబుమ్న కేతెంచి ముహూర్తమును బరీక్షించి గ్రహస్థితులు బరికించి జాతకమునువ్రాసి యీ పురుషశిశువు సర్వంసహాచక్రంబునిర్వక్రలెల బరిపాలించు రాజుశ్రేష్టుండగునని మాధవశర్మతో బ్ అలుక నతండు నట్లాశీర్వదించెను. పిమ్మట మాధవశర్మ యాశిశువునకు జాతక ర్మసంస్కారంబు నాచరించెన్.  ఆచిన్నవానికి దండ్రియు, గురువును, దైవమును మాధవశర్మయేగనుక నతనినామమే తన తనయునకును బెట్టవలసిన దని సిరియాలదేవి కోరినందున నట్లే మాధవశర్మ యని నామకరణము చేయబడియెను. ఇట్లాచిన్నవాడు మాధవశర్మగృహమున దినక్రమప్రవర్ధమానుడై పెరుగుచుండగా నైదవయేట నక్షరాభ్యాసమున్ విధ్యుక్తముగా గావించిరి. తరువాత నుపనయయాది సంస్కారములు జరిగినవట1 మఱియు బెరిగి పెద్దవాడై సద్గురుముఖంబున బెక్కువిద్యలను గ్రహించి విఖ్యాతు డగుచువచ్చెను. అతడు ప్రతిదినమును అనుమకొంద పద్మాక్షి దేవియాలయానికుం జని మిక్కిలి శ్రద్ధాశక్తులతో నామెను సేవించుచు వరప్రసాదమునుబొంది నిర్ఫక్రపరాక్రముండు నజయుండునై వన్నె కెక్కుచుండెను. అతడొక్కనాడు తనతండ్రి కటకరాజుతో జరిగిన యుద్ధమున జంపంబడియె నని విని క్రుద్ధుడై పగసాధింప దీక్షవహించెను. అంతట గ్రమక్రమముగా నీరాజపుత్రుని నవమన్మధాకరమునుగూర్చియు, వివిధ విద్యాప్రౌఢిని గూర్చియు, పరాక్రమమునుగూర్చియు, విచిత్రములయిన కధ