పుట:Andhrula Charitramu Part 2.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శోకసంతప్త చిత్తయై ధన కనక వస్తు వాహనాదుల నన్నిటిని విప్రవరులకు దానము చేసి శాత్రవు లంత:పురము నాక్రమించుకొనకముందే కోటవిడిచి యనుమకొండకు బోయి యెఱుకుదేవరాజు వంశమున జనించిన మఱియొక యెఱుకదేవరాజ్ను శరణు చొచ్చెను. ఇచ్చట కందారంబున సోమదేవుని సైన్యము నెల రోజులు బల్లహునితో భోరాడి హతమై పోవ నాతడు కందారము నాక్రమించు కొనెను. బల్లహుడు బలవంతుడు గనుక బలవంతునితో విరోధమువలన దనకు హాని సంభవించు నని సిరియాలదేవిని తన పట్టణమును విడిచి పొమ్మని యెఱుకదేవరాజు చెప్పినందున నక్కడ సిరియాలదేవి మిగుల దు:ఖించుచు నేమి గతియని విచారించుచు బ్రాహ్మణోత్తముడును, షట్కర్మ నిరతుడును, దయా దాక్షిణ్యశీలుడు నైన మాధవశర్మ కడకుంబోయిరక్షింపు మని యతని పాదములపై బడియెను. ఆబ్రాహ్మణోత్తముడామెను లేవనెత్తి యామెవలన వృత్తాంతమును విని జాలిపనొంది 'ఓసాధ్వీ! నీకు భయం రానంతయును లేదు. సిద్ధేశ్వరుండు నిన్ను రక్షించునుగాక! మద్గృహంబున నివసించి యుండుము.' అని అభయహస్త మొసంగెను. అంతట సిరియాలదేవి ప్రచ్చన్న వేషముతో మాధవశర్మ యింట సురక్షితముగా నుండెను. మాధవశర్మచేసిన కార్యమునకు బ్రాహ్మణు లందఱును సంతోషించి యాతని కనుకూలురై యీవృత్తాంతము నంతయు నితరు లెఱుగరాకుండ బరమగోప్యముగా నుంచిరి. అట కందారంబున నున్న సామంతులందఱున్ బల్లహునితో బోరాడజాలక పట్టణమును విడిచి విదేశంతులైరి. కటకవల్లభుడు తన పంతంబుసాగెనని విజృంభించి దయాధర్మ శూర్యుడై కోటలుద్రవ్వి కవాటములు విఱిచి మేడలుగూల్చి యంత:పురమును నేలమట్టముగావించి సిరియాలదేవికై యిల్లిల్లు వెదకి సందుగొందుల బరికించి యెందునుంగానక పరితపించుచు జాడలు తీయగా నామె యనుమకొండకు బాఱి పొవుట దెలియవచ్చెను. అంతట నతడు మంత్రిసేనాసమేతుడై పోయి అనుమకొండను ముట్టడించెను. ఎఱుకదేవరాజు తనపట్టణమును సంరక్షింపదనే సేనధిపతుల నియోగించి మంత్రివర్గముతోడ నాలోచించుచుండెను.