పుట:Andhrula Charitramu Part 2.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశుగణంబుల ముట్టికొని రక్షకభటవర్గమును నుగ్గాడి పోవుచున్నవి." అని బల్లహుని దుర్నియమును గూర్చి మొఱ్ఱపెట్టుకోగా నతడు కొపోద్దీనితుడై సైన్యంబులు గూర్చికొని సమరోన్ముఖుడై కటక పురీమార్గముంబట్టి కొనిపోయి శత్రూరదుర్గమును ముట్టడించి బల్లహునితో నాఱునెలల వఱకు బోరాడుచునే యుండెను. తుదకు సోమదేవుని సైన్యములు శత్రుశరపరంపరల ముంగట నిలువజాలక పలాయనము లగుడు బల్లహుని సైన్యంబులు దుర్గమును విడిచి వానిని దఱము కొట్టెను. ఇట్లెడగక కొంతకాలమువఱకు సోమదేవుడును బల్లహుడును బొరాడుచుండ రొకప్పుడు బల్లహుడును, మఱి యొకప్పుడు సోమదేవుడును విజయము గాంచుచుండిరి. కడపట బల్లహునితో బోరాడుటను విడేచిపెట్టి సోమదేవరాజు కందారంబునుండి వెడలక యుండెను. ఒకనాడు సోమదేవరాజు తనశత్రువయిన బల్లహుడు ప్రబలుడై యుండుటయు, తనకు బురుషసంతానము లేకుండుటయు దలపోసి అమాత్యపురోహితబందువర్గమును రావించి తనదు:ంఅమునకు కారణమును దెలిపి సంతానము గలుగుమార్గ మెట్లని వారల నడిగెను. అంతట బురోహితులు పుత్రకామేష్టియాగ్ఫము నాచరింపవలయునని బోదించిరి. పిమ్నట సోమదేవరాజు తనభార్య యయిన సిరియాలదేవి సమ్మతిని గైకొని ద్విజవర్యుల తోడ్పాటుతో యధావిధిగ బుత్రకామేష్టి యాగమునను జేసి భూరి దక్షిణతోని సంతరెపణముతోను బ్రాహ్మణోత్తంఊళాణ్ బూజించెన్. మఱికొంతకాలమునకు సిరియాదేవి గర్బము దాల్చెను. శత్రుసంహారము కొఱకు బుత్రకామేష్టిని యొనరించి సోమదేవుడు పుత్రుని బడయనున్నాడని బల్లహుడువిని భయకంపితుడై రాణితోగూడిన రాజును బట్టుకొనవలయునని బహుసైన్యలం గూర్చుకొని ప్రస్థానరభేరి ,మ్రోగించి గజ ఘటయపదాతి వర్గమ్లతో వెడలివచ్చి కందారంబును ముట్టడించెను. మమావీరుడైం సోమదేవరాజును వెనుదీయక శత్రువులను మార్కొని యురువది దినములు ఘోరమైన యుద్ధమును జేసెను. ఆ యుద్ధమున సోమదేవరాకి వీరస్వర్గము గాంఛెను. ఈదు:ఖకరమైన వృత్తాంతమును సిరియాదేవి విని