పుట:Andhrula Charitramu Part 2.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బల్లహుని రాయబారులు వచ్చి "నీకుబలవర్విరోదుంంబు క్షేమకరంబు గాదు; సిరియాడేవిని నొసంగి నీపట్టణమును గాపాడుకొమ్ము." అని తెలియ జెప్పినా అందునకు నెఱకుదేశరాజా వారలతో నిట్లనియె. "అయ్యా ! మాకు బలద్విరోధముతోబనిలేదు. సిరియాలదేవి యీపట్ట్టణమున నున్నదని మీకు నమ్మిక యున్నయెడల మీరు స్వేచ్చగా వచ్చి యిల్లిల్లు వెదకి తెలిసికొనవచ్చును; మా యభ్యంతర మెంతిమాత్రమును లేదు గాని, మీరు మాత్రము నిరాయుధులై పట్టణమును బ్రవెశింపవలయునే గాని యాయుధపాణులై రారాదు; మీ రాకపోకల కెవ్వరు నడ్డమురారు; మఱియు సిరియాలదేవి గాన్పించినయెడల మెరు గొనిపోవుటకు మే మడ్డుపడువారము గాము" అని విస్పష్టంగా దెలుప, వారలు పోయి యీవృత్తాంతమును బల్లహునికి నివేదింపగా నతడు విస్మితుడై వర్ణాశ్వమవిధంబునకు భంగము కలుగకుండ జాతుర్వర్గ్యము వారిని వెదుక బంపెను. సిరియాలదేని గనుకొని దెచ్చినవారికి గొప్ప బహుమానము లిచ్చెద న్ని వాగ్ధానము చేసెను. వారి లెల్లరున్ బోయి వేయి కన్నులతోడ బట్టణమంతయు బరిశోధించి చూచిరి గాని యెక్కడను వారలకు సిరియాదేవి గానిపించదయ్యెను. అప్పు డొకధూర్తి బ్రాహ్మణుడు రాజువలన దనకు విశేష బహుమానములు లభించు నని మిక్కిలి శ్రద్దవహించి యేడవనాడు మాదవవర్మగృహంబు బ్రవేశీంచి ప్రచ్చన్న వేషముతో నున్న సిరియాలదేవిని గాంచి యామె సుందరాకారమును బట్టి రాజపత్ని యని భావించి యీమెయే సిరియాలదేవి యని మాధవశర్మతో జెప్పగానతడు "సరి సరి, యీమె నాపుత్రిక, నా యల్లుడు కాశికింబోవుచు నీమె నిచ్చట నుంచిపోయె" నని యెంత చెప్పినను నాతడు వినక తనవారినిం గూర్చుకొని యామెను బట్టుకొని యెఱుకు దేవరాజు కడకు గొనిపోయెను. అంతట బట్టణములోని బ్రాహ్మణు లందఱేకమై "అయ్యా ? ఇద్ ఏమి యాగడము? రాజపత్ని యని చెప్పి బ్రాహ్మణకాంత నెత్తికొనిపోవుటకంటె పాపకృత్యంబు వేఱొండు గలదే? లోకములో సౌందర్యంబు క్షత్రియకాంతలకేగాని నెఱవారికి లేదా?