పుట:Andhrula Charitramu Part 2.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దంతీశ్వరశాసనము శా.శ. 1140 దివ సంవత్సరమునను వ్రాయబడినది. అనగా క్రీ.శ. 1212 దివసంవత్సరముంకు క్రీ.శ. 1224 వ సంవత్సరమునను జగదేక భూషణనరసింహదేవమహారాజు చక్రకూటరాష్ట్రమును బరిపాలించ్చున్నవాడని పైశాసనములనుబట్టి మనకు బోధపడుచున్నది. వీరసోమేశ్వరునకు మహాప్రధానిగ నుండిన మాండలికసోమరాజునరసింహదేవునకుగూడ మహాప్రధానిగ నుండేనని యాశాసనములలో నొకదానివలన దెలియుచున్నది. ఇత డెంతకాలం పరిపాలనము చేసెనో యది బోధ పడకున్నది.

                      రాజాధిరాజ జయసింహదేవమహారాజు.
   నరసింహదేవమహారాజునకి బిమ్మట రాజాధిరాజ జయసింహదేవమహారాజు రాజ్యాధిపత్యము వహించెనని స్వర్ణపురశాసనమునుబట్టి తెలియుచున్నది. ఇయ్యది జయసింహునిభార్యలగు లోకమహాదేవియొక్కయు, శాసనమహాదేవి యొక్కయు, దానశాసనమైయున్నది. పంచప్రధానుల సమక్షమున అధికాడ యను గ్రామమును లోకమహాదేవి దానము చేసియుండెను. శాసనములందు కాలము చెప్పబడియుండలేదు.  స్వర్ణపురము (Sunarpal)  నారాయణపురము నకు (Narayanpal)  పదిమైళ్లదూరమున నున్నది. జయసింహదేవుని చరిత్ర మెంతమాత్రేమున్ దెలిసికొనుట కాధారములు గానరాకున్నవి.
               రాజాధిరాజ హరిశ్చంద్రదేవరమహారాజు
   ఇతడు క్రీ.శ. 1324 గవ సంవత్సరమునకు బూర్వము దిక్రకూటతాష్ట్రమును బాలనము సేయుచుండినటుల దమిరె శాసనముంబట్టి దెలియుచున్నది. ఆ సంవత్సర మీహరిశ్చంద్రదేవుడు మృతింనొందగా నతనిభార్య మాణిక్యదేవి భర్తతో సహగమనము గావించె నని యాశాసనమున జెప్పబడినది.   ఈనాగరాజులు క్రీ.శ. 1324 దవ సంవత్సరమువఱకును చక్రకూటరాష్ట్రమును బరిపాలనము సేయుచునే యుండిరి.
                               -----