పుట:Andhrula Charitramu Part 2.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుమకొండ రాజ్య ప్రాచీనగాధలు

                     క్రీ.శ. 230 మొదలి క్రీ.శ. 1076 వఱకు
   ఇప్పుడు నైజామురాష్ట్రములో ఓరంగ లనుపేరిటం జరుగుచుండు ఓరుగంటికి సామీప్యమున నున్న హనుమకొండయే అనుమకొండె యని పూర్వకాలంబున్ బేర్కొనంబడి ప్రసిద్ధచారిత్రము గలిగియున్నది. త్రిలింగదేశ మనునామాంతరము గల యాంధ్రదేశమునకు నేకశిలానగరం బనియెడు నోరుగల్లు రాజధానిగ నుండుటకు బూర్వ మొకప్పు డీయనుమకొండ రాజధానిగ నుండెను.  క్రీస్తు శకారంభమున నీభాగ మాంధ్రసామ్రాజ్యమున జేరియుండి శాతవాహనవంశజు లయిన యాంధ్రచక్రవర్తులచే మూడవశతాబ్దమధ్యమువఱకును బరిపాలింపబడి యెను  అశాతవాహనచక్రవర్తులయొక్క చరిత్ర మాంధ్రులచరిత్రములోని ప్రధమ భాగమున సవిస్తరముగ దెలుపంబడియున్నది.  క్రీస్తుశకము 230 దవ సంవత్సరము మొదలుకొని పదునొకండవ శతాబ్దాంతమువఱకు నీయనుమకొండ రాజ్యముయొక్క చరిత్రము విశ్వసింపదగని గాధలతో, గూడుకొని యున్నది.  ఆంధ్రచక్రవర్తులలో గడపటివాడగు మూడవపులమాని క్రీస్తుశకము మూడవశతాబ్దప్రారంభమున నీదేశమును బరిపాలించుచుండెను. అతనికాలముననే యనేకశతాబ్దములనుండి వర్దిల్లుచుండిన యాంధ్ర సామ్రాజ్యము విచ్చిన్నమై అనేకభాగములుగ నేర్పడినప్పుడు పశ్చిమ భాగములు రాష్ట్రకూటులకును కదంబులకును, ఉత్తరభాగము లీభీరులకును కాలచుర్యులకును, ప్రాగ్దక్షిణభగములు పల్లవులకును వశంబులై వేర్వేఱు రాజ్యములుగ బరిపాలింపబడుచు వచ్చినది. కృష్ణామండలములోని బేతవోలు (జగ్గయ్యపేట) స్తూపమునందలి యొకశాసనములొ ప్రసిద్ధికెక్కిన యిక్ష్వాకు వీరుడను మాధారయొక్క పుత్రుడు నగు శ్రీ వీరపురుషదతునియొక్క 21