పుట:Andhrula Charitramu Part 2.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విరుచుడ్గప్రభుయొక్కయు, సరకోట కొమ్మనాయకునియొక్కయు సమక్షమున కేరమరశ యనుగ్రామముపై వచ్చునట్టి రాబడిని పైశివాలయములకు శా.శ.1131 సంవత్సరఫాల్గున శుద్ధ 12 భానువారమునాడు (అనగా క్రీ.శ. 1210 దవ సంవత్సరము ఫిబ్రవరినెల 7 తేది) దానము చేసెను. కన్నరదేవ మహారాజు యొక్క నారాయణపురశాసనమునకును గంగామహాదేవునియొక్క యీ శాసన మునకు నడుమ నూఱేండ్ల వ్యవధి గానవచ్చుదున్నది. ఇద్దఱు మహారాజు లిందీర్ఘ కాలము పరిపాలించి నారనుట కొంచెము సందేహాస్పదము నుండక మానదు. ప్రస్తుత మీశాసనములవలన నింతకన్నా నధికము తెలియరాదు.

                 జగదేక భూషణనరసింహదేవమహారాజు.
     జగదేకభూషణవీరసోమేశ్వరమహారాజునకు బిమ్మట నాతని కుమారుడయిన జగదేకభూషణనరసింహదేవమహారాజు రాజ్యాధిపత్యము వహించి నటుల నాతనికాలమునాటి రెండు తెలుగుశాసనములవలన దెలియు చున్నది.  ఇతనితల్లి గంగాదేవి అని చెప్పబడుటచేతను, గంగాదేవి జగదేకభూషణ వీరసోమేశ్వరమహారాజునకు పట్టమహిషియై యనేకదానధర్మములు చేసి యుండుటచేతను, ఈనరసింహదేవమహారజు వీరసోమేశ్వరమహారాజుయొక్క తనయుడే యనియు, అతని మరణమున కనంతరము రాజ్యమును వహించి నాడనియు నూహింపబడుచున్నాడు.  ఇతరనాగరాజులకుం గల బిరుదావళులే యితనిగూర్చి ప్రశంసించిన శాసనములయందు బేర్కొనబడినవి. ఒక శాసనము దంతివాడ (Dantewara) యందును, మఱియొకశాసనము యశ:పురము (Jasanpal) నందును వ్రాయబడినవి 1. దంతివార లేక దంతివాడ (దంతీశ్వరము) ఇంద్రానదికి దక్షిణమున నున్నది.  యశ:పురము దంతివాడకు 4 మైళ్లదూరముననున్నది.  ఈరెండిటియందును నరసింహదేవునినామము గానబడుచున్నది.  యశ:పురశాసనము శా.శ. 1147 వ సంవత్సరమునను

1.Epigraphia Indica Vol.X. Ins. No.9.