పుట:Andhrula Charitramu Part 2.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డని చెప్పవచ్చును. అయినను వేంగడము (తిరుపతి) లోనుండు వేంగడ నాధుని సందర్శించినవాడనని చెప్పుకొనియుండుటచేత మతసహనము వహించిన వాడని వ్యక్తమగుచున్నది.

అల్లుర తిరుకాళత్తి దేవరాజు

ఇతని శాసనములు కొన్ని నెల్లూరుసీమలో గానిపించుచున్నవిగాని, ఇతడు స్వతం్రతుడుగాక తెలుగుచోట రాజుల క్రింద సామంతుడుగనుండినటుల ఊహింపదగియున్నది. ఈ తిక్కరాజు పల్లవుడని గండవరము గ్రామములోని శాసనములవలన తెలియుచున్నది కావున, ఇతనికిని మనుమసిద్ధిరాజు తండ్రియగు చోడుతిక్కరాజునకు ఏ విధమైన సంబంధము లేదు. ఇతడు దేవస్థానములకును, బ్రాహ్మణులకును, అగ్రహారములు భూదానములు మొదలగునవి చేసియుండెను. ఇతడు క్రీ.శ.1182వ సంవత్సరప్రాంతముననున్నవాడు. ఆ కాలముననే కడప మండలములో సిద్ధనదేవమహారాజు పరిపాలనముచేయుచుండెనని కడపమండలములోని చింతలపుత్తూరు శాసనమువలన తెలియుచున్నది.

అభిదేవ మలిదేవమహారాజు

ఈ పల్లవరాజును తాను పల్లవుడననియు, భారద్వాజగోత్రుడననియు, ముక్కంటికారువెట్టి వంశజుడననియు, కామకోట్యంబిక భక్తుండననియు చెప్పుకొని యుండుటచేత ఇతడును బైపల్లవరాజు వంశములోనివాడనియే చెప్పదగును. ఇతను క్రీ.శ.1218-19వ సంవత్సర ప్రాంతముననున్నవాడు. ఇతడును దైవతాభక్తియు,బ్రాహ్మణభక్తియుగలిగి యనేకాగ్రహారములను దానము చేసియున్నాడు.

ఇమ్మడిదేవమహారాజు

ఇతడును శ్రీశైలమునకు తూర్పుదేశమున డెబ్బదియగ్రహారములను నిర్మించిన ముక్కంటికాడువెట్టియొక్క వంశజుడని పైవారి వలెనే పెక్కు బిరుదములను వహించియుండెను. తన తండ్రి భీమరాజునకును,తల్లి సిరియాదేవికిని, పుణ్యమునకై నాగలావరముననందు చెన్నకేశవపెరుమాళ్ళను ప్రతిష్ఠచేసి