పుట:Andhrula Charitramu Part 2.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యా దేవర అర్చకత్వమునకై శ్రీరంగభట్టు కొడుకు పెరుమాడినంబిని నియమించి,ఇతనికిని అనేక బ్రాహ్మణవర్యులకును భూదానములు మొదలగునవి చేసియున్నాడు. ఇతడును స్వతంత్రుడుగాక, మరియొకనికి లోబడియుండెననియే ఊహింపదగియున్నది. ఈ పల్లవరాజు క్రీ.శ.1268-69వ సంవత్సర ప్రాంతముననున్నవాడు.

మహారాజసింహుడు

పల్లవుడైన ఈ మహారాజుసింహుడు మిక్కిలి ప్రసిద్ధికెక్కినవాడుగ కనిపించుచున్నాడు. ఇతడు ద్రావిడ భాషాశాసనములలో కొప్పరంజింగదేవుడని వ్యవహరింపబడినవాడు. ఇతని దానశాసనములు క్రీ.శ.1243 మొదలుకొని 1279 వరకు కనిపించుచున్నవి. ఇతని శాసనములు కందమోలి (కర్నూలు) మండలములోని త్రిపురాంతకము నందును, గోదావరి మండలములోని ద్రాక్షరామమునందును, గన్పట్టుచుండుటచేత నా కాలమునందీతడు తెలుగుదేశమునందు స్వసైన్యముతో సంచరించున్నవాడని తేటపడుచున్నది కాని, ఏ కారణముచేత తెలుగుదేశమునకు వచ్చెనో, ఎంత కాలముండెనో, భావి పరిశోధనమువలన తెలియదగినదే కాని, ప్రస్తుత సాధనములంబట్టి తెలియరాదు. ఇతడు కాకతీయ గణపతిదేవునియొక్క యవసానకాలమునందును, రుద్రమదేవి యొక్క పరిపాలనాకాలమందును, కాకతీయ సైన్యాధిపతులతో పోరాడుచు జయాపజయములను కాంచుచువచ్చి తుదకు కాకతీయులకు వశ్యుడై అంతరించెనని తోచుచున్నది. ఇతడొకచోటునుండి పరిపాలనము చేసినట్లు కనబడలేదు. ఇతడు కాంచీపురమునందున్న కాలమున మనుమసిద్ధిరాజు తండ్రియగు తిక్కరాజుచే జయింపబడినటుల ఇదివరకే తిక్కరాజుచరిత్రమున తెలిపియున్నాడను.

మఱికొందరు పల్లవరాజులు

త్రిపురాంతక శాసనములలో గన్పట్టెడి అల్లాడ పెమ్మయదేవమహారాజు,విజయగండగోపాలదేవమహారాజు, పౌడకమాదిసిద్ధిరాజు మనుమడు