పుట:Andhrula Charitramu Part 2.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రెండవ ప్రకరణము.

క్రీ.శ. 1272-73వ సంవత్సరమున విక్రమసింహపురాధిపతియై యున్నటులను, అంగపళందనాడులోని భూములను గొన్నిటిని భీమనదేవుడనకు దానము చేసినటులను, ఈడూరులో వెలసియున్న చొక్కనాథస్వామి యాలయములో శాసనము వ్రాయించెను.

నెల్లూరు నాగరాజులు

పైన చెప్పిన నాగదేవుడు నాగవంశమున జనించిన వాడుగ గనుపట్టుచున్నాడు. ఇతడాంధ్రచక్కవర్తిని యగు రుద్రమదేవి కాలమునుండి నెల్లూరు మండలములోని కొంత భావమునకు బరిపాలకుడుగా నియమింపబడి యుండెను. చోడచక్రవర్తులకును, కాకతీయాంధ్ర చక్రవర్తులకును సామంతులుగనుండిన నాగవంశజులమని చెప్పుకొనిన రాజులు కొందరు నెల్లూరు మండలమున అప్పుడప్పుడు పరిపాలనము చేయుచువచ్చిరి. రాజరాజదేవచోడ చక్రవర్తి యొక్క 18వ పాలన సంవత్సరమున నాత్రేయగోత్రజుడును, అహిక్షేత్రపురాధీశ్వరుండును, మధ్యదేశాధీశ్వరుండును. ఫణిమండలాధిపతియును, శివపాదశేఖరుండను బిరుదారచితుడును, కులోత్తుంగ చోడపట్ట శేఖరదేవుని కుమారుడునగు సిద్దరాజుయొక్క దానశాసనము గూడూరు సీమలోని మల్లమను గ్రామములోని సుబ్రహ్మణ్యేశ్వరుని యాలయములో వ్రాయబడియున్నది. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తికి సామంతుడుగ నుండి యా ఆలయముననే వ్రాయించిన దానశాసనములో తానాత్రేయ గోత్రజుడననియు, ఫణిమండలాధీశ్వరుడననియు, అహిక్షేత్రపురాధిపతి ననియు, చెప్పుకొన్న పెద్దరాజుకూడ పైనుదాహరించిన సిద్ధరాజు వంశములోని వాడేయనుట కెంత మాత్రమును సందియము లేదు. ఈ పెద్దరాజు కొడుకు సిద్ధరాజు, తన జ్యోష్ఠసోదరి యగు పచ్చలదేవి మనుమసిద్ధి రాజు యొక్క భార్య యని గూడూరుసీమలోని రెడ్డిపాలెములో నున్న పాండురంగస్వామి ఆలయములో తాను వ్రాయించిన దానశాసనమున బేర్కొనియున్నాడు. ఈ సిద్ధరాజుయొక్క భార్య ఒరయూరుచోడు డనుశూరళ్వారు కత్తిదేవ రాజు