పుట:Andhrula Charitramu Part 2.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నబ్దికట్టువిడుచు నచ్చుతుకొదమాను
మరుడు మరల కలుగు మగలరాజ."

అని తన సైనికులెల్ల హాహాకారంబులు సేయుచుండ బ్రాణంబులు దేహంబులు విడిచినవిధం బా కవివర్యుండే మరలనిట్లు చెప్పియున్నాడు.

"సీ. నందినిబుత్తెంచె నిందు శేఖరుడునీ
వన్నెయే తెమ్ము తారాద్రికడకు,
గరుడుని బుత్తెంచెఎ నరహరి రావయ్య
వడి సిద్ధతిక్క కైవల్యమునకు,
హంసనుబుత్తెంచె నజుడు నీకడకును
భయకుల మిత్త్ర రా బ్రహ్మసభకు,
నైరావతముబంపె నమరేంద్రుడిప్పుడు
దివమునకేతెమ్ము తిక్కయోధ,

గీ. యనుచు వేరువేర నర్థితో బిలువంగ
వారువీరుగూడ వచ్చివచ్చి
దివ్యయోగియైన తిక్కనామాత్యుడు
సూర్యమండలంబు జొచ్చిపోయె."

తరువాత కాటమరాజునకును మనుమసిద్ధిరాజునకును యుద్ధము జరిగి యా యుద్ధమున నిరువురును గూడ వీరస్వర్గమును జూరగొన్నట్లుగా గాటమరాజు చరిత్రము వలన దెలియుచున్నది. ఈ యుద్ధము జరిగినది యే సంవత్సరమో సరిగా జెప్పుట కే యాధారమును గానిపింపలేదు. కందుకూరు సీమలోని గుండ్లపాలెములో భ్రమరేశ్వరాలయములో నొక రాతిపలకపై నీ విషయము సంగ్రహముగా దెలుపబడియెను గాని, యందు జెప్పబడిన కాలము వేరుగను నాయకులు వేరుగనున్నారు. [1] అందసందర్భ విషయములెన్నో గలవు. ప్రతాపరుద్రుని కాలమున ననగా శా.శ.1170 కాళయుక్తి సం. కార్తీక శుద్ధ పంచమీ గురువారమున జరిగినటుల దెలుపబడినది. ఇందు జెప్పబడిన

  1. 1.Nellore Inscriptions, Vol.II, Kandukur, 26