పుట:Andhrula Charitramu Part 2.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనంబు తల్లడిల్లుచున్నది. తొలంగుట నీకును మాకునుగూడ శ్రేయస్కరంబని యూహింతు" నని గొంతెత్తి గంభీరవాక్యంబులు పలుక దిక్కనయు "ఓ నాయడా! రణశూరుడవై యుద్ధము సేయజాలక పందక్రియ ధర్మపన్నంబులేల చదివెదవు? వానింగొన్న నేనెరుంగుదునుగాని, వీరుడ వౌదువేని కదలక నిలుచుండి యుద్ధంబుచేసి చేతనయ్యెనేని నా ప్రాణంబులు గొని విజయపతాకమెత్తుము. కాదేని శరణుచొచ్చి మా పుల్లరి మాకు బెట్టుము" అని హెచ్చరింప బిన్నమనాయడు బ్రహ్మహత్యాదోషమునకు వెరచి యేమిచేయుటకును జేతులును గాళ్ళునాడక నిశ్చేష్టితుడై చూచుచుండ, వాని మంత్రి బ్రహ్మరుద్రయ యచటికి నేతెంచి "తిక్కన నేదలంపడి పోకార్చెద నీవటుండు" మని తన ప్రతి వీరునిపై హయంబును బరపి యుద్ధము చేయగా నిరువుర గుర్రంబులు నీటెపోటుల నేలంగూల, ఇరువురును గత్తులు దూసి "హర హరా" యని యభిమన్యు, లక్ష్మణకుమారుల వలె ద్వంద్వయుద్ధంబునకు గలియంబడి యుభయసైన్యంబుల వారును నివ్వెరపడిచూచుచుండ బెద్దయుం బ్రొద్దు పోరాడి తుదకు నేలకొరిగిరి. ఆపాటుంగని తిక్కన సైనికులలో హతశేషులయిన వారలీ క్రింది విధముగా జెప్పుకొని యాక్రందించిరని యొక కవి చెప్పియున్నాడు.


"సీ. ధైర్యంబు నీమేన దగిలియుండుట జేసి
చలియించి మందరాచలము తిరిగె,
గాంభీర్యమెల్ల నీకడన యుండుట చేసి
కాకుత్థ్సుచే వార్ధి కట్టువడియె,
జయలక్ష్మి నీ యురఃస్థలినె యుండుట జేసి
పారిపోయి బలిదానమడుగుకొనియె,
నాకారమెల్ల నీయందె యుండుటజేసి మరుడు చిచ్చునబడి మడిసిచనియె,

గీ. దిక్కదండనాథ దేవేంద్రపురికి నీ
పరుగుటెరిగి నగము తిరుగుటుడుగు