పుట:Andhrula Charitramu Part 2.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లే బ్రాహ్మణుడగు నండూరి కొమ్మనామాత్యుడు క్రొత్తచర్ల పరిసర భూములందు గటకరాజుతో బోరాడి చూపిన యుద్ధనైపుణ్యమును మంచనకవి కేయూరబాహుచరిత్రమునందు,

"సీ. నెలకట్టె వాటున జెలగి రెంటిని మూటి
గూడ గుర్రంబులు గుదులుగ్రుచ్చు
బ్రతిమొగం బగు వరపతుల కత్తళమున
గడిమమై వీపులు వెడల బొడుచు,
బందంపుగొరియల పగిది నేనుంగుల
ధారశుద్ధిగ వసిధార దునుము,
జిదియించు బగిలించు జేతుల తీటవో
వడిగాండ మేసి మావతుల తలలు,

గీ. తల పుడికి వ్రేసి మావంతు తలలు శత్రు
రాజ శిరములు ద్రొక్కించు రాగె దిరుగ
వాగె నుబ్బెడు తన వారునంబుచేత
మహిత శౌర్యుండు కొమ్మనామాత్యవరుడు."

అని మిక్కిలి మనోహరముగా వర్ణించి యున్నాడు. ఆ కాలమునందీ బ్రాహ్మణమంత్రివరులు రాజ్యతంత్రమునందు మాత్రమే గాక యుద్ధతంత్రమునందును బ్రవీణులైయుండిరనుట కిట్టి దృష్టాంతములెన్నియైన నాంధ్ర సారస్వతమునం గనుంగొనగలము.

ఇట్లు ప్రచండ విక్రమార్కుడై ఘోరసంగ్రామంబున శత్రుసేనను మార్కొని పీనుంగుపెంటలు గావించుచు రణకేళి సల్పుచుండ, యాదవ వీరులును వెనుదీయక మహోదగ్రులై తిక్కనసైన్యముపై బడి కత్తుల గఠారుల నీటెలం బొడిచి చక్కాడుచు బెద్దకాలంబు పోరాడ నుభయ సైన్యంబులం బెక్కండ్రు వీరభటులు నేలంగూలిరి. అంతట చిన్నమనాయడు ఖడ్గతిక్కనను సమీపించి "ఓ విప్రోత్తమా! యుద్ధము చేయుట బ్రాహ్మణునకు బాడిగాదు. మిమ్ముం జంపిన మాకు బ్రహ్మహత్యా దోషంబు వాటిల్లునని నా "