పుట:Andhrula Charitramu Part 2.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతడు ద్విపద కావ్యముగా రచియించెను. ఈ కవికాలమెప్పుడో మనకు నిశ్చయముగా దెలియరాదుగాని, యితడు ప్రతాపరుద్రునికి తరువాతనుండిన వాడని చెప్పవచ్చును. అందువలన సిద్ధేశ్వరచరిత్రములోని విషయములన్నియు యధార్థములని విశ్వసింపరాదు. ఈ సిద్ధేశ్వరచరిత్రమును బట్టియే కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని తమ్ముడును, ఆధునికుడునగు జగ్గకవి సోమదేవరాజీయమను పద్యకావ్యమును రచియించెను. అక్కనబయ్యనలను దాయాదులు మనుమసిద్ధిరాజును నెల్లూరునుండి పారద్రోలి రాజ్యమాక్రమించుకొని పరిపాలించుచుండ, మనుమసిద్ధిరాజు పక్షమున నతని మంత్రికయు నాస్థానకివయునగు తిక్కనసోమయాజి కాకతీయుల రాజధానియైన యేకశిలానగరమను నామాంతరముగల యోరుగంటికిబోయి, గణపతిదేవచక్కవర్తికి భారతాఖ్యానమును వినిపించి, యనతి వలన బహుమానమునలను బడసి, యతనితో మనుమసిద్ధి దురవస్థను జెప్పగా, నాతడు సదయహృదయుడై సోమయాజుల రాయబారమును మన్నించి, బహుసైన్యముతో దండెత్తి వచ్చి అక్కనబయ్యనలను నెల్లూరునుండి పారద్రోలి, మనుమసిద్ధిని బునరభిషిక్తునిగావించి, వెడలిపోయెనని సిద్ధేశ్వరచరిత్రములోని ఈ క్రింది చరణముల వలన బోధపడగలదు.

"తగుమాట విను మొక్క ధర్మకార్యంబు
సూర్యవంశంబున సొబగొందునట్టి
యార్యపూజితవర్యుడామన్మసిద్ధి
రాజు దా నెల్లూరు రమణతో వేల

                        *                                                         *                                                           *

అక్కనబయ్యనలధిక బలిష్ఠు
లక్కట సిద్ధిరాయని బారద్రోలి
దక్కిన రాజ్యంబు తామె యేలుచు
నొక్కకాసైనను జక్కగ వీరు
వారల దండించి వారి నెల్లూరు