పుట:Andhrula Charitramu Part 2.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రెండవ ప్రకరణము

77

వారికిప్పింపు మవారణఁ బ్రీతి
ననిన, గణపతిరాజట్లకా కనుచు
                                                   ***
వెడలి గణపతియు విజయంబునకును
గుడియెడమల సేన కొలిచి యేతేర
వెలనాడు చేరియు వీడెల్ల గాల్చి
వెలనాటి రాజును వెసగెల్చి వాని
యప్పనంబులు గొని యటచని రాజు
గుప్పున నెల్లూరుకూడనేతెంచి
యక్కన బయ్యన నచట సాధించి
                                                   ***
నెల్లూరు ప్రజల నేర్పు వాటిల్లఁ
జెల్లించె మన్మనసిద్ధి రాజునకు
నెల్లూరి పట్టంబు నేర్పుతోఁగట్టి
సల్లలితాదృతి సమదుర్గములను
నరువదెనిమిదియు నగుపట్టణముల
నరుదొంద సాధించి యా మన్మసిద్ధి
రాజుకిచ్చియుఁ దన తేజంబు దిశలఁ
బూజకెక్కఁగ ఘనరాజిత యశుఁడు
ఘనతటాకంబు దాఁ గట్టించె నచటఁ
గొనకొని నెల్లూరఁ గొన్నెలలుండి
మనుమసిద్ధికి రాజ్యమహిమలు దెల్పె."

ఈ పై గ్రంథమునఁ బేర్కొనంబడిన యక్కనబయ్యనలను వారి నామములేశాసనములందును వినంబడకున్నవి. మనుమసిద్ధి రాజు యొక్క శాసనములు కందుకూరు సీమలోని పెంట్రాలలోఁ గాన్పించుచున్నవి. అయ్యవి 1257 మొదలుకొని 1262 వఱకుఁ గానిపించుచున్నవి. కడప మండలములోని