పుట:Andhrula Charitramu Part 2.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గానంబడుచున్నది. పైవానిలో విజయక్ష్మాధీశ్వరునికి జెప్పబడిన విశేషణములు విజయగండగోపాలునకు మ్రాతమే వర్తించుచున్నవిగాని, మరియొకనికివర్తింపజాలవు. ఇతడు క్రీ.శ.1250 మొదలుకొని 1266 వరకును బరిపాలనము చేసినట్లుగ గానంబడుచున్నది. ఇతని శాసనములు కాంచీపురమునందు మాత్రమేగాక, నెల్లూరుమండలములోని గూడూరు, నెల్లూరు, సూళూరుపేట తాలూకాలలో గానిపించుచున్నవి. మనుమసిద్ధి తండ్రియగు తిక్కరాజు కాలమున బాండ్యులు కాంచీపురముపై దండెత్తివచ్చి యారాజ్యమాక్రమింపగా దిక్కరాజు పాండ్యులతో యుద్ధముచేసి వారలను దరిమి మరల చోడునిసింహాసనమున గూరుచుండబెట్టి చోళస్థాపనాచార్య బిరుదమును వహించెనని తెలిసికొనియుంటిమికదా. తిక్కరాజు మరణానంతరము పాండ్యరాజులు తమ తొంటిపూనికను విడనాడక కాంచీపురము మొదలుకొని యుత్తరభూమిని జయింపగోరి పలుమారుదాడి వెడలివచ్చి నెల్లూరునకు దిగువనున్న దేశమును గల్లోలపెట్టుచుండిరి. వారిలో జటవర్మసుందర పాండ్యమహారాజు ప్రముఖుడుగానుండెను. క్రీ.శ.1249వ సంవత్సరమున గాకతీయగణపతిదేవ చక్రవర్తి యాంధ్రదేశమునుండి పాండ్యరాజులను బారద్రోలి కాంచీపురముననొక దేవాలయములో నొక దానశాసనమును వ్రాయించెను. [1]

అయినను, జటవర్మసుందరపాండ్యమహారాజు మరుసటి సంవత్సరమునందనగా 1250వ సంవత్సరమున కాంచీపురమార్గమున నాంధ్రదేశముపై దండెత్తివచ్చి తెలుగుచోడులను జయించి మనుమసిద్ధిరాజును నెల్లూరినుండి పారద్రోలి సిద్ధిరాజునకు శత్రువులయిన వీరులను పట్టాభిషిక్తులను గావించి నెల్లూరులోని పళ్ళికొండపెరుమాళ్ళ దేవునకు మండనాడులోని మావడికుండ గ్రామమును దానముచేసెనని తెలిపెడి శాసనము

  1. Ind.Ant.Vol.XXI. p.202; Ep Ind. Vol. VII. No. 588, Kielhorn's List of Inscriptions of Southern India.