ద్వితీయాచార్యుడ[1]ని బిరుదుగాంచిన యీయధర్వణాచార్యుడు పదునొకండవ శతాబ్ధముననో పండ్రెండవ శతాబ్ధారంభముననో నున్నవాడు. మరియును పదమూడవశతాబ్ధ ప్రాంతమునున్న విద్యానాధకవి తన ప్రతాపరుద్రీయమున ద్రిలింగములు బేర్కొని త్రిలింగదేశప్రశంస సలిపియున్నాడు.[2] మరియు నా శతాబ్దమునందే యుండిన విన్నకోట పెద్దనామాత్యుడు తనకావ్యాలంకార చూడామణియందు "క|| ధరశ్రీపర్వతకాళేశ్వర దాక్షారామసంజ్ఞ వరలంద్రిలింగా | కరమగుటనంధ్రదేశకంబురుదారం ద్రిలింగదేశమన మనజనగృతులన్ ||" గీ. తత్రిలింగపదము తద్భవంబగుచే | దెలుంగు దేశమున దేటబడియె | వెనుక దెనుంగుదేశమునండ్రుగొంచర | బ్భా షను దగతులం బరగుచుండు." నని వ్రాసియున్నాడు. పదునేడవ శతాబ్ద ప్రాంతమున నుండిన కాకుమార్యప్ప కవియు దన వ్యాకరణములో: ---
క|| శ్రీక్షితి ధర కాళేశ్వర, దాక్షా రాంమంబుల నంగఁ దనరారెడు నీ
క్షేత్రంబుల లింగమ, లీక్షితిని ద్రిలింగ సంజ్ఞ కెన్నిక కెక్కున్.
తే.గీ. తత్త్రిలింగ నివాసమై తరుకతన
నాంధ్ర దేశంబు దాఁ ద్రిలింగాఖ్యమయ్యె
దెలుఁగ గుచు దద్భవము దాని వలనఁ బొడమె
వెనుక కొందఱు దానినె తెనుఁగునండ్రు.
అని శ్రీశైలము, దాక్షారామము, కాళేశ్వరము, ఈ మూడు క్షేత్రముల లింగములును త్రిలింగములనియు, వానిచే నొప్పు నీదేశము త్రిలింగ దేశమనియు వ్రాసి యున్నాడు.
- ↑ ప్రధమాచార్యుడని నన్నభట్టునకు బిరు8దము గలదు. గావున నధర్వణాచార్యుని ద్వితీయా చార్యుడందురు.
- ↑ "మైర్దేసస్త్రిభిరేషి యాతి మహతీం ఖ్యాతింత్రిలింగాఖ్యాయా యే షాంకాకతి రాజ కీర్తి విధ వైః కైలాస శైలాకృతాః తే దేవాః ప్రసరత్పసాదస్మభురాశ్శ్రీశైల కాళేశ్వరః దక్షారామనివాసినః | ప్రతి దినంత్వచ్ఛ్రేయ జాగ్రత " ప్రతాప రుద్రీయం, నాటక ప్రకరణే పంచ మంకం. 44.