పుట:Andhrula Charitramu Part-1.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గంజాము మండలములో నుత్తరభాగముననున్న మహేంద్రగిరి నీత్రిక్షేత్రములను గలిపెడి ప్రాకారములమధ్య కట్లుకొనిరాగలిగెనో బోధపడకున్నయది. ఈ యాంధ్రవిష్ణు నిచ్చటివాడని విచారింపగా నితడు శ్రీకాకుళమును బాలించిన సుచంద్రుని కొడుకనియు అతడు కలియుగంబున స్వాయంభవుమనువుకాలమున నున్నాడనియు ఆంధ్రకౌముదియందు దెలుపబడినది.[1] బ్రహ్మాండపురాణము పదునొకండవ శతాబ్ధమున వ్రాయబడినదిని కొందరుపండితులూహించుచున్నారు. ఎప్పుడు రచింపబడినను బహుసమీపమైనదనుటకు సందియములేదు. బ్రహ్మాండపురాణము లోని యీ వాక్యమే మరికొన్ని గ్రంధములలో బేర్కొనబడి యుండెను. బ్రహ్మాండపురాణమునందు మాత్రమేగాక స్కాందపురాణమునందును త్రైలింగులు అని యాంధ్ర దేశస్థులు పిలువంబడిరి. [2]

ఇంతియగాక, త్రిలింగ శబ్ధానుశాసనమును, వ్యాకరణమున, నధర్వణాచార్యులు, త్రిలింగశబ్ధములకు వ్యాకరణము రచించెదనని చెప్పియున్నాడు.[3]

 1.  ఆంధ్రనాధో మహావిష్ణు ర్నిశంభుదనుజాపహా |
  పురాస్వాయంభువమనోః కాలేకలియు గేవారః |
  అభసంవత్సర్వదేవైశ్చ వేష్టితో లోకపూజితః
                      ఆంధ్రకౌముది

 2. శ్లో. కర్ణాటాశ్చైవత్రైలింగ గూర్జరరాష్ట్ర వాసినః|
  ద్రావిడాద్రావిడాఃపంచ నింధ్యదక్షిణ వాసినః|
       (స్కాంద పురాణము వాచస్పత్యము)

 3.  శ్లో. జయతిప్రసిద్ధంలోకే సర్వలక్షణలక్షితం |
  శబ్ధలింగశబ్ధనా మధర్వణకవేఃకృతిః|
  కరోమిశబ్ధంశబ్దంశబ్దానాం త్రిలింగానాంనలక్షణం |
  బార్హ స్పత్యానిమాత్రాణి కాణ్వంవ్యాకరణం విదన్
  అధర్వణాచార్యకృత త్రిలింగశబ్ధానుశాసనం.