పుట:Andhrula Charitramu Part-1.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పై ప్రమాణవచనములను బట్టి "శ్రీశైలము, భీమేశ్వరము లేక దాక్షారామము, కాళేశ్వరము" అను త్రిక్షేత్రముల లింగముల మధ్యనుండు దేశము త్రిలింగదేశమనియు, త్రిలింగశబ్దభవము తెలుగుగుటం జేసి తెలుగదేశమయినదనియు మనపండితుల యభిప్రాయమని తేటపడుచున్నది. ఈ తెలుగు దేశమునే తరువాతి వారు తెనుగుదేశమని కూడ వాడుచువచ్చిరనుటకు సందియము లేదు. పదునొకండవ శతాబ్దారంభమున నుండిన నన్నయ భట్టారకుడు భారతము దెనిగించుచు కం. జనమత కృష్ణద్వైపా, యనమునిష్ఫషభాభిహిత మహాభారతము| ద్ధనిగూపతార్థమేర్పడఁ దెనుగునరచియింపు మధికధీయుక్తి మెయిన్. అనియు ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథావివిధార్థయుక్తితో | నారపిమేలునా నితిరు లక్షరరమ్యత నాదరింపవా| నా రుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెలుంగు[1] న న్నహాభారత సంహితా రచనబంధురుడయ్యె జగద్ధితమబుగనే" అనియు వ్రాసి " తెనుగు;తెలుగుననుపదములు రెండును ప్రయోగించెను. అనగా నన్నయ కాలమునాటికి నీ తెలుగుశబ్దము త్రిలింగశబ్ధభవముగా వాడబడుచుండెను. త్రిలింగపదము త్రికళింగపద వికారమయినను, సంస్కృతమైనను త్రిలింగమునుండి తెలుగుపదము పుట్టినదనుటకు సందియము లేదు. పాలకభేదమును బట్టి యీ యాంధ్రదేశమునుకు హద్దు తెలియక పోగా నాంధ్రదేశ వ్యాప్తి నిరూపణమునకై యెకవేళ శ్రీశైలాది త్రిక్షేత్రముల లింగములను హద్దులుగా తదనంతురులు గ్రహించి యుండుటంజేసి యంధ్రదేశమునకు ద్రిలింగ సంజ్ఞ గలిగినం గలుగవచ్చును.[1]

వేంగి దేశము.

ఆంధ్రదేశమునకు వేంగి దేశమను పేరుగూడ వాడబడియుండెను. చోళమండలమునకు రాజధానియగు కాంచీపురమునకు నైఋతిభాగమున వెంగియును నొక చిన్న గ్రామమిప్పటికిని గలదు. ఆ ప్రదేశము మొదట నిర్జనంబయి

  1. 1.0 1.1 ఇది వేంగిరాజుల చరిత్రమున జర్చింపబడవలసిన విషయము గావున గ్రంథవిస్తరభీతిచే నీచర్చ నిచ్చట విరమించుచున్నాడను.