పుట:Andhrula Charitramu Part-1.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తుతము బాలకాండము విక్రయమునకు సిద్ధముగానున్నది. ఇందు సుమారు పదునాఱు (Halftone) ప్రతిమలు గలవు.

శాశ్వతపుచందాదారులకు అంచెకూలితో వెల ర్పు. 1 0 0
తదితరులకు ర్పు. 1 8 0

ఈ ఏప్రిల్ మాసము 30వతేదీలోపల తమపేరును రిజిష్టరు చేసినవారికి సాధారణనామసంవత్సరపంచాంగము పారితోషికముగానియ్యబడును.

ముందుగానే చందాధనము పంపనక్కఱలేదు. ఆయాసంపుటము వెలువడగానే దాని వెలమాత్రము వసూలు చేయబడును.

వేదాస్తగ్రన్థరత్న మాల నాగరిలిపి:- ఇది 1097వ సంవత్సరము జూలై మాసమునుండి మాసపత్రికగా ప్రకటింపబడుచున్నది. మాసమున కొకసారి 40 పుటలుగల సంచిక పంపబడును. సంవత్సరమునకు పోస్టేజిసహా చందా. 3 0 0
శ్రీ యాళవందార్లుసాదించిన చతుశ్లోకీస్తోత్రరత్నమ్. దేవనాగరిలిపి:- శ్రీవేదా న్తదేశికులవారు రచించిన వ్యాఖ్యానముతో గూడినది. ప్రశస్తమైన కిత్తానుబైండు చేయబడినది. 1 0 0
శ్రీ భగవద్రామానుజుల వారు సాదించిన శ్రీభాష్యమ్. నాగరిలిపి;- డెమ్మి ఎనిమిదిపేజీలసైజున అతిప్రశస్తమైన కాగితములమీద అచ్చుపడుచున్నది. ఇందు అచ్చటచ్చట నుండు ప్రమాణాకరములును అధికరణాంతమున వేదా న్తసారమును వేదాన్తదీపమును గ్రంథాంతమున అధికరణపారావళియు, చేర్పబడియున్నవి. దీని వెల ప్రథమభాగము. 3 0 0
రెండవభాగము. డిటో డిటో 2 0 0
నృసింహశతకము- మూలము మాత్రము 0 1 0
సుమతి శతకము:-టీకాతాత్పర్యసహితము, చక్కగా పరిశోధితమై చిన్నసైజున గ్లేజు కాగితములమీద అచ్చువేయబడియున్నది. 0 2 0