పుట:Andhrula Charitramu Part-1.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సులభముగాను ఉండునట్లు తెనిగించి ప్రకటింప నుద్యోగించియున్నారము. ఇపుడు ప్రథమమున వాల్మీకి ప్రణీతమైనయాదికావ్యంబై ఐహికాముష్మికఫలప్రదమై యున్న శ్రీమద్రామాయణము తెనిగింపబడియున్నది. ఇందు గోవిందరాజులు మహేశ్వరతీర్థులు మొదలైన వ్యాఖ్యాతలు ఆయాముఖ్యశ్లోకములకు వ్రాసియున్న అర్థవిశేషములును,వేదాదులనుండి చూపియున్న ప్రమాణములును, పురాణాదులనుండి సంగ్రహించినకథలును, వెరియవాచ్ఛాంబిళ్ల యనువారు కొన్ని శ్లోకములకు మిక్కిలి యద్భుతముగా బ్రతిపాదించియున్న యర్థవైభవములును రహస్యవివరణములును అన్నియు తేటగాను ముచ్చటగాను అచ్చటచ్చట ఆయాపుటలక్రింద కూర్పబడియున్నవి. వేయేల! సంస్కృతమునంగల వ్యాఖ్యానములను కొని రామాయణము చదువుపండితులకు ఎన్నివిశేషవిషయములు తెలియునోఅన్నియు ఈ తెనుగు రామాయణము చదువువారికిని దెలియుననవచ్చును. ఈగ్రంథము మాయానందముద్రాయంత్రాలయములోని మేలైనయచ్చునరాయల్ ఎనిమిదిపేజీలసైజులో మూడుమాసముల కొకసారి సుమారు 200 పుటలుగల ఒక సంచికగా మిక్కిలి సుందరములైన పెక్కు ప్రతిమలను కూర్చి ప్రకటింపబడును. నూఱుపుటలుగల పుస్తకము శాశ్వతముగా చందాదారులు అగువారికి ఎనిమిది అణాలవెలచొప్పున ఏర్పఱపబడును. శాశ్వతపోషకులకు అంచెకూలి తపాలా వీసి ఖర్చులు మేమే భరింపగలవారము. పుస్తకమంతయు ముద్రింపబడిన వెనుక కొనువారలకు నూఱుపేజీలకు పండ్రెండు అణాలచొప్పున వెలయేర్పఱపబడును. కాబట్టి శ్రతిస్మృతీతిహాసపురాణాదులందలి విశేషవిషయములనెల్ల దెలియగోరు ఆంధ్రభాషాభిమానమానవీయులందఱును ఈ మాయుద్యమమునకుతోడ్పడి త్వరలో చందాదారులగుటకిదియె మంచి సమయమని తెలియునది.