పుట:Andhrula Charitramu Part-1.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డయ్యును స్వప్రయోజనపరుడుగాక దేశమును బాలించుటకుం దగినప్రభువునను గ్రహింపుమని బ్రహ్మను గూర్చి తపస్సుచేసెను. బ్రహ్మ వాని తపస్సునకు మెచ్చి శైలోద్భవుని బుట్టించెను. ఇతడు శైలములోనుండి పుట్టినవాడు గనుక వీనికి శైలోద్భవుడని పేరు పెట్టెను. ఈశైలోద్భవుడు కళింగము బాలించెను. వీనికి రణభీతుడు పుట్టెను. రణభీతునకు సైన్యభీతుడు పుట్టెను. సైన్యభీతునకు మాధవవర్మ జనించెను. ఈ రాజేంద్ర మాధవేంద్రుడు శివభక్తుడు, ఇతడు హరితగోత్రుడును తైత్తరీయశాఖా బ్రాహ్మణుడును వామనభట్టుమనుమడును ఆదిత్యదేవుని కుమారుడునగు భట్టవామనునకు గుడ్డవిషయములోని వ్యూపినగ్రామమును సూర్యగ్రహణసమయమున దానము చేసెను. ఈ మాధవవర్మ నివాసము కయింగోడయనునది. కుండభోగికుమారుడగు ఉపేంద్రసింహునిచే నీశాసనము వ్రాయబడినది. మాధవవర్మ యేకాలమునందలివాడోవీనియుదంతమేమో యింతకన్న మనకేమియును దెలియరాకయున్నది.

హౌనుత్సాంగు.

ఏడవశతాబ్దమధ్యమునందు హౌనుత్సాంగు కళింగమును జూడవచ్చి యప్పటదేశస్థితి యిట్లు దెలిపియున్నాడు.

ప్రాచీనకళింగము యొక్క రాజధాని నగరము 5మైళ్ల వైశాల్యముగలిగియున్నది. భూమి సారవంతమై క్రమముగా వ్యవసాయము చేయబడుచున్నది గాని యేనుగులతో గూడిన యడవులనేకములుగలవు. జనులు మోటుగనగారికులుగ నుండి భయంకరముగనున్నను మాట దప్పనివారుగను విశ్వాసపాత్రులుగనుండిరి. పూర్వకాలమునందు కళింగ మొండొరుల బుజములు రాపాడునంతటి జనసమ్మర్ధము గలిగి యుండెను. అప్పటికి గళింగదేశముయొక్క పూర్వవైభవమంతయుబోయినది.

కళింగగాంగవంశము.

ఏడవశతాబ్దమునందే కళింగదేశము గాంగులవశమయ్యెను. బ్రహ్మయెక్క నాల్గవతరము వానికి గంగాదేవి యనుగ్రహించినందున నొక్కకుమారుడు గలిగెను. వాని సంతతివారు గాంగులయిరి. వీరు మొదట మైసూరు