కి బ్రాణములర్పించుకొనిరి. లక్షలకొలది కాళింగులు మాగధులచేబట్టువడి క్రూరసంహారమునంతయు గన్నులారజూచిన యీమహాచక్రవర్తి తరువాత తలపోసికొని నిరపరాధులను నాగరికులనయిన సాధుజనులకు నిష్కారణముగా విపత్తు ఘటింపజేసితినిగదాయని పశ్చాతప్తుడై మిక్కిలి దుఃఖించి "అహింసాపరమోధర్మ" మను బుద్ధుని వాక్యమును జ్ఞప్తికిదెచ్చుకొని యా బుద్ధధర్మము నవలంబించి బౌద్ధుడై తరువాత బౌద్ధమతమును ప్రపంచమునందంతట బ్రకటింపజేసెను. క్రీస్తునకు బూర్వము రెండవశతాబ్దమధ్యమున ఖారవేలుడను కళింగరాజు శాతకర్ణియను నాంధ్రరాజుతోడ్పాటుతో మగధరాజగు పుష్యమిత్రుని నోడించి యుత్కలములోని ఖండగిరియందు శాసనమువ్రాయించెను. ప్లీని మొదలగు చరిత్రకారులుగూడ కళింగమును బ్రశంసించియున్నారు. తరువాత నీకళింగమాంధ్రచక్రవర్తుల రాజ్యమునకు వశమయ్యెను. ఆంధ్రులకు బిమ్మట పల్లవుల పాలబడియెని తోచుచున్నది. క్రీస్తుశకము నాలుగవశతాబ్దమధ్యమున గుప్తచక్రవర్తియగు సముద్రగుప్తుడు కళింగముపై దండెత్తి వచ్చినపుడు కళింగము పెక్కుభాగములుగ విడిపోయి పెక్కండ్రురాజులచే బాలింపబడుచుండెను. కొత్తూరుదుర్గమును స్వామిదత్తుడును ఈరందపళ్లను (ఈ రధవిషయము) దమనుండును బాలించుచుండిరి. (ఇవి రెండును గంజాముజిల్లాలోనివి.) దేవరాష్ట్రమును కుబేరుడును అవముక్తసీమను నీలరాజును బాలించుచుండిరి. (ఇవిరెండును విశాఖపట్టణమండలములోనివి.) షిష్టపురము మహేంద్రవర్మ పరిపాలించుచండెను. (ఇది గోదావరిమండలములోనిది) కాబట్టి యివన్నియును గళింగములోనివి. మఱియును బల్లవులలో చండవర్మ నందప్రభంజనవర్మయను రాజులీ కళింగదేశమును బాలించిరని పల్లవులనుగూర్చిన ప్రకరణమునం దెలిపియుంటిమి. ఏడవశతాబ్దమున గళింగము గాంగులవశమయ్యెనని గన్పట్టుచున్నది. అయినను పుళిందులీదేశమును గొంతకాలము బాలించినట్లు గాన్పించుచున్నది.
పుళిందులపాలనము.
కళింగదేశనివాసియగు పుళిందసేనుడనువాడు బహుపరాక్రమ వంతు