కుండినడయినయింద్రభట్టారకుడేయని చెప్పుచున్నారు. ఇందేదిసత్యమో యేదియసత్యమో నిర్ధారణ చేయజాలకున్నారము. ఈయింద్రభట్టారకవర్మ కొడుకు విక్రమేంద్రవర్మ, ఇతడీ పేరుగలవారిలో రెండవవాడు. ఈ రెండవ విక్రమేంద్రవర్మశాసనమొకటి గోదావరిమండలములోని తునిజమిందారిలోనున్న చిక్కుళ్లయను గ్రామమునందుదొరకినది.[1] వీనిశాసనము లెందులూరు (దెందులూరు) నుండి ప్రకటింపబడినది. ఈ దెందులూరు గ్రామమిప్పటి యేలూరుపట్టణమునకు మూడు మైళ్లదూరముననున్నది. ఇది పూర్వము వేంగిపురములోని యొక భాగముగానుండెను. ఇతడును తనతండ్రివలెనె శ్రీపర్వతేశ్వరపాదారాధకుడనని చెప్పుకొనియుండెను. తనపరిపాలనము యొక్క పదవసంవత్సరమున గ్రీష్మ ఋతువులోని యెనిమిదవ పక్షమున పంచమీతిధియందు నేత్రపాటివిషయములో గృష్ణానదీతటంబున రావిరేవ గ్రామమునకు నాగ్నేయమూలనున్న రేగొండ్రగ్రామమును సోమగిరీశ్వరనాథుని దేవాలయమునకు ధారపోసెను. విక్రమేంద్రవర్మకు దెందులూరు రాజధానియని చెప్పియుండుటయు, కృష్ణానదీతటంబుననుండిన గ్రామమును దానము జేయుటయుజూడగ గోదావరికృష్ణానదులకు నడుమనుండిన వేంగిదేశమున కధిపతియని స్పష్టపడుచున్నది. చాళుక్యులు 7వశతాబ్దము మొదలుకొని యాప్రదేశమును జయించి పరిపాలించుచుండినవారని మన మెఱుంగుదుము. కాబట్టి విష్ణుకుండినులంతకు బూర్వమీదేశమును బరిపాలించుచుండిన వారయియుండకతప్పదు. అట్లు కాదేని విక్రమేంద్రవర్మ చాళుక్యులలోబడిన యొకమాండలికుడెయుండవలయును. భావిపరిశోధనముల వలనంగాని నిజము దేటపడదు.
కళింగముయొక్క పూర్వచరిత్రము.
గాంగులనుగూర్చి తెలుపుటకుముందు పూర్వచరిత్రమునుగూర్చి కొంచెము చెప్పవలయును. భరతఖండమునంగల దేశములలో నెల్లగళింగదేశము బహుపురాతన ప్రసిద్ధిగలదిగ గన్పట్టుచున్నది. బ్రాహ్మణుల వాజ్మయము నందును బౌద్ధులవాజ్మయమునందును కళింగదేశము ప్రశంసింపబడినది. రామా
- ↑ Ep. Ind vol. IV. pp. 193, 194,195.