పుట:Andhrula Charitramu Part-1.pdf/402

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లో ఇంద్రభట్టారకుని పదభ్రష్టుని జేయుటకై అధిరాజేంద్రవర్మ కొందఱు రాజులను గూర్చుకొని తాను నాయకుడుగా నేర్పడి కుట్రచేయ బ్రయత్నించెనని చెప్పబడియుండెను.

కుబ్జవిష్ణువర్థన మహారాజుయొక్క ద్వితీయపుత్రుడున జయసింహవల్లభమహారాజుయొక్క తమ్ముడును నైన ఇంద్రభట్టారకుడు క్రీ.శ. 663 వసంవత్సరమున రాజ్యమునకు వచ్చి 6 మాసములు మాత్రము పరిపాలనముచేసెను. డాక్టరుప్లీటు గారు పృధ్వీమూలుని శాసనములో బేర్కొనబడిన యింద్రభట్టారకుడితడేయనియు, అధిరాజేంద్రవర్మ గంగవంశజుడై కళింగనగరము రాజధానిగా గళింగదేశము నేలిన యింద్రవర్మ మహారాజనియు, వీరికి జరిగిన యుద్ధములో ఇంద్రభట్టారకుడు మరణమునొంది యుండవచ్చుననియు, ఆకారణముచేత నతనిపరిపాలనమాఱుమాసములలోనే ముగిసిపోయినదనియు డాక్టరు ప్లీటుగారు వ్రాసియున్నారు. అట్లూహించుట కొక కారణమునుగూడ నుడివియున్నారు. ఇంద్రభట్టారకుని కుముదము సప్రతీకముపై నధిష్టించియుండిన యొకానొకయింద్రాధిరాజుచే గొట్టబడెనని చెప్పబడియుండుటజేసియు, నైరుతిదిక్కునందలి యేనుగునకు కుముదమనియు ఈ శాన్యదిక్కునందలి యేనుగునకు సుప్రతీకమనియు, నామములుండుటంజేసియు, చాళుక్యులు నైఋతిదిక్కునందలివారును, గాంగులీశాన్యదిక్కునందలివారు నగుటంజేసియు డాక్టరు ప్లీటుగారు ఇంద్రభట్టారకుడు చాళుక్యరాజనియు, అధిరాజేంద్రవర్మ కళింగనగరాధిపతియనియు గుర్తించుచున్నారు. డాక్టరు కీల్ హారన్ గారీవాదమునే గైకొనియింద్రభట్టారకుడు విష్ణుకుండినుడయిన యింద్రభట్టారకవర్మ మహారాజేయని సిద్దాంతము చేసియున్నారు. ఎందుకన విష్ణుకుండినుడయిన యింద్రభట్టారకుడు తనయేనుగులబలముచే నితరచతుర్దంతములను జయించినవాడని తనశాసనమునందు గొనియాడంబడియుండెను. ప్రాక్దిశాధిపతియగు నింద్రునియైరావతమునకు చతుర్దంతములేక చవుదంతియను నామముగలదు. సామాన్యముగానీనామమె తూర్పు దిక్కునందలి యేనుగులకన్నిటికిని వర్తించును. గనుక నీచతుర్దంతముల కధిపతియైన కళింగనగరాధీశ్వరుడయిన అధిరాజేంద్రవర్మను జయించినవాడీ విష్ణు