పుట:Andhrula Charitramu Part-1.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బులకును చోడులకును లోబడినవారలై యాంధ్రకర్ణాటకదేశములలోని కొంతభాగమును బరిపాలించినవారుగా నుండరి. వీరిశాసనములు కడపమండలములోను మైసూరు రాజ్యములోని కోలారు మండలములోను గానుపించుచున్నవి. కడపమండలములోని యొక శాసనము గండత్రినేత్రుడను వైదుంబరాజుకాలములోనిదైయుండెను. ఈ గండత్రినేత్రుడను వైదుంబరాజు మహాబలిబాణరాజుతో గలిసి సుప్రయోగనదీతటంబుననుండిన శూరమతి యను ప్రదేశమున నలంబాధిరాజుదాడిగతోడను రాచమల్లునితోను యుద్ధముజేసెను. ఈవిషయమునే యీ గండత్రినేత్రుని కాలములోనిదగు మదనపల్లిశాసనమువలనగూడ స్పష్టపడుచున్నది. రైసుగారు తమకోలారుశాసనముల సంపుటములో వైదుంబరాజులవి రెండు శాసనముల నుదాహరించియున్నారు. వానిలో నొకటి గండత్రినేత్రునికాలములోనిదైయున్నది. ఈ గండత్రినేత్రుడును కడపశాసనములో నుదాహరింపబడిన గండత్రినేత్రుడును నొక్కడేగాని భిన్నులుగారు. ఈ శాసనములు రెండును క్రీ.శ.900 సంవత్సరములోనివిగా రైసుగారు నిర్ణయించియున్నారు. [1] విక్రమాదిత్యుడను వైదుంబరాజు రాష్ట్రకూటరాజయినమూడవకృష్ణునకు సామంతమాండలికుడుగ నుండి మాలాడు, బాణగొప్పాడి, సింగపురనాడు, వెంకుండ్రకొట్టము మొదలగువాని బరిపాలించుచున్నట్లొకశాసనమున దెలుపబడినది.

తిరుకోయిలూరునకు సమీపముననుండు కీలూరుశాసనములు మూడరాష్ట్రకూటరాజగు మూడవకృష్ణునకు లోబడిన సామంతమాండలికుడును వైదుంబుడునగు చందయ తిరువయ్యయనువాని బేర్కొనుచున్నవి. [2] ఈ శాసనములు మూడును క్రీ.శ. 960దవ సంవత్సరమునకును 964వ సంవత్సరమునకును నడుమ వ్రాయబడినవిగ నున్నవి. ఆఱువేల గ్రామములను గలిగియుండిన గంగవాడి దేశమును బాలించుచుండి నలంబరాజగు దిలీపయ్యకులోబడిన సామంతమాండలికుడుగ నుండిన వైదుంబవిక్రమాదిత్య తిరువయ్యయనువాని పేరు నుదా

  1. Ep. Car. Vol. X- introduction p.XXII
  2. Annual Report; on Epigraphy for1904-05, para 28.