చూడామణి ప్రభుమేరునియొక్కయు(No. 542 of 1906) కాలములోనివైయున్నవి. వీనిలోగడపటిది కాడువత్తిముత్తరాజు కోయటారుపైబడి దోపిడి గావించుటను ప్రశంసించి బాణరాజు వడుగావళి (ఆంధ్రపథము) లోని 12000 గ్రామములను మన్నెలో 200 గ్రామములను బరిపాలించుచుండెనని దెలుపుచున్నది. కడపటిచోడుల శాసనములలో పేరంబాణప్పాడి దేశము (బాణదేశము) పడమటపుంగనూరువఱకును వ్యాపించియుండెను. కాబట్టి పాలేఱునదికి నుత్తరముననున్న యిప్పటి యుత్తరార్కాడు మండలమంతయు బాణరాజ్యములోనిదని చెప్పుటకెంతమాత్రమును సందియములేదు. క్రీ.శ892-93 సంవత్సరప్రాంతమున నలంబరాజగు మహేంద్రాధిరాజనలంబుడు బాణవంశమును నిర్మూలమును చేసితినని గొప్పగా జెప్పుకొనియుండెను. క్రీ.శ 902 మొదలుకొని 948 వఱకు బరిపాలనము చేసిన తంజాపురచోళరాజగు మొదటిపరాంతకుండిరువురు బాణరాజులను నిర్మూలము చేసి వారలదేశమును గాంగుడైన రెండవ పృధ్వీపతికి బహుమానము జేసెను. [1]
పృథివేంద్రవర్మకు లోబడియుండిన అలగమయ్యయను బాణరాజొకసామాన్యప్రభువై యుండెను. ఇట్లు చోళరాజగు పరాంతకునిచే బదభ్రష్టులైన కతంబున బాణులలో నొకకుటుంబము వారాంధ్రదేశములో నుత్తరభాగమునకు వచ్చినట్లుగాన్పించుచున్నది. బాణవంశజుడగు శూరబలిరాజు యొక్క పండ్రెండవ శతాబ్దములోని శాసనమొకటి గుంటూరు మండలములో కొణిదెన గ్రామములో గానంబడుచున్నది. [2]
వైదుంబ వంశము.
వైదుంబులు తొమ్మిదవ పదవశతాబ్దములలో రాష్ట్రకూటులకును[3] నలం