పుట:Andhrula Charitramu Part-1.pdf/392

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ర్యకులమని కొందరును పెక్కండ్రు పెక్కురీతులుగా వమవంశోత్పకులను గూర్చి చెప్పికొనిరే గాని యీ మహాబాణులవలె రాక్షసుల సంతతివారమని వారెవ్వరును చెప్పుకొని యుండలేదు. వీరలు తాముదాన నాగ్రణియగు బలిచక్రవర్తి యొక్క కొడుకైన మహాబాణుని వంశము లోని వారమని చెప్పికొనియుండిరి. మాచదువరులు భాగవత విష్ణుపురాణములోని బలిచక్రవర్తియొక్కయు బాణాసురుని యొక్కయు కథలను చదివియు వినియునుందురు. వామనమూర్తియైవచ్చిన విష్ణువుకు భూవలయమంతయు ధారపోసి సర్వస్వమును గోల్పోయి పాతాళమున కనగ ద్రొక్కబడిన వాడు బలి చక్రవర్తి. శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడు తనకూతురైన యుషాకన్యతో నంతపుర మందిరమున నుండుటగాంచి మహోదగ్రుడై యనిరుద్ధుని బట్టిబంధించి యాకారణమున శివకేశవులకు బోరాటము పెట్టి తుదకు శ్రీకృష్ణునిచే ముప్పుగాంచినవాడు బాణాసురుడు. వానివంశమున జన్మించిన జనించితిమని చెప్పుకున్నవారే ఈ మహాబాణులు. వీరు శైవమతావలంబకులు నల్లని టెక్కెము గలవారు. వృషభలాంఛనులు. నండీశ్వరుని భక్తులు. వీనికి మొదట మైసూరురాజ్యములోనున్న కోలారుమండలము లోని అవణ్యనగరము (Avani) రాజధానిగానున్నట్లు గంపట్టెడివి. తరువాత నుత్తరార్కాడు మండలములోని తిరువళ్ళము రాజధానిగ నుండెను.

ఇది పాలేఱున కుపశాఖయగు నీవానదియొక్క పడమటి యొడ్డున నున్నది. అనేక శాసనములందు తిరువళ్ళము బాణాపురమని పేర్కొనబడియున్నది. ఈ మండలము పేర బాణప్పాడి (మహాబాణదేశము) అని పిలువబడుచుండెను. బాణపురముకు సమీపమునందొక పాలెము బాణసముద్రమని పిలువబడుచుండెను. మరియొక గ్రామము బాణుల కాలము నుండి బాణవరమను పేర బరగుచు షోళింఘురునకు (చోళింగవరము) (Railway Station) సమీపమున నున్నది. బాణాపురమనియెడి యీతిరువళ్ళము చోడుల శాసనములయందు తికాలివళ్ళమని గూడ పేర్కొనబడినది. అప్పుడది జయకొండ ళచోమండలములోని భాగమగు పాడువూరు కొట్టములో జేరియుండెను. ఈ పాడువూరు కొట్ట మొకప్పుడు త్యాగాభరణ వలవాడను పేరనొప్పియుండెను. కొన్ని శాసన