పుట:Andhrula Charitramu Part-1.pdf/393

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ములలో తిరువళ్ళము పేరంబాణ ప్పాడిలోని మీయాఱునాడు లోనిదనియు, మరికొన్ని శాసనములలో కరై బలినాడు లోనిదనియు బేర్కొనబడియుండినదిగాని అది యెక్కడుండెనో దెలియరాదు. కొందరు చరిత్రకారులు రాయవేలూరునకు దక్షిణభాగమున నున్న పడైవీడు పరివీరపురమని చెప్పుచున్నారుగాని యింకను స్థిరపడి యుండలేదు. ఈమహాబాణుల రాజ్యమాంధ్రపథమునకు (నడుగావళికి) బడమటయున్నదని కొన్ని శాసనములు దెలుపుచున్నవి. ఆంధ్రమండలములోని 12000 గ్రామములు వీరిరాజ్యములో జేరియుండినవి. ఈ బాణరాజులు స్వతంత్రులుగాక పల్లవరాజులకు గొంగపల్లవ రాజులకు లోబడిన మాండలికులై ప్రఖ్యాతిగాంచినవారుగా గన్పట్టుచున్నారు. విద్యానాథపండితుడు బాణవంశమునుగూర్చి ప్రతాప రుద్రీయమునందు ప్రశంసించియున్నాడు. 1903 వ సంవత్సరమున బ్రకటింపబడిన బాణుల శాసనమున లైదింటిలోనూ మూడు (NOs 226, 228, of 229 1903) పల్లవులు గొంగపల్లవులు బాణులకు ప్రభువులని పేర్కొనియున్నవిగాని రెండుశాసనములు మాత్రమట్లు పేర్కొనియున్నవిగాని రెండుశాసనములు మాత్రమట్లు పేర్కొనియుండలేదు.

ఆ రెండును విజయాదిత్య బాణరాయని కాలములోనివై శక సంవత్సరములు 820,821వ సరియైయిన క్రీస్తుశకము 827-828దవ సంవత్సరములలో వ్రాయబడినవిగా నున్నవి. [1] ఈ రెండింటిలోనూ మొదటిది విజయాదిత్యుని బాణవిద్యాధరుని కొడుకని నుడువుచున్నది. గాంగపల్లవుడగు నృపతుంగని శాసనములో (NO 228 of 1903) నుదహరింపబడిన బాణవిద్యాధరుడు నితడు నొక్కడే యని చెప్పవచ్చును. ఈనృపతుంగ మహారాజు తొమ్మిదవ డతాబ్ధములోని కడపటికాలము నందుండినవాడు. గొంగపల్లవరాజగు దంతవిక్రమవర్మకు మాండలిక సామంతుడైన విజయాదిత్యుని కన్నను పల్లవరాజగు నంది పోతవర్మ కాలములో నాంద్రపథమునకు బడమట బరిపాలనము సేయుచుండిన విక్రమాదిత్యుడు పూర్వుడై యుండును. ఈవిక్రమాదిత్యుడు గాంగపల్లవుడగు విజ

  1. No. 678, 679, Public 12th August 1904