యున్నను తక్కిన రాజవంశముల వారివలెనె వీరును పోకలుపోయియుందురు. గాని నిజముగా నీచోడులకు నాచోడులకు సంబంధమేమియును గానరాదు. వీరు కరికాల చోడవంశజులమని చెప్పుకొన్నంత మాత్రముచేత నాచోడులిచ్చటికివచ్చి పరిపాలించినవారని భ్రమింపరాదు. విక్రమసింహపురమనియెడు నెల్లూరును బాలించిన మనుమసిద్ధిరాజును వానిపూర్వీకులనుగూడ తాము కరికాలచోడవంశజులమని చెప్పుకొనియుండిరి. ఇట్లనేకులు తాముకరికాలచోడవంశజులమని చెప్పుకొనియున్నను వీరెవ్వరును పెట్టుచోడలెగాని పుట్టుచోడులుగారు. ముఖ్యముగా విచారింపవలసినది మఱియొక్కటికలదు. వస్తర(బస్తరు) రాజ్యములోని చక్రకోట్యమును బాలించు సింధువంశజుడయిన ధారావర్షునికి లోబడిన సామంతుడిగనుండి వానికి మంత్రిగను సైన్యాధిపతిగనుండిన చంద్రాదిత్యుడను నాతడు తానుకరికాల చోడవంశజుడ ననియు కాశ్యపగోత్రుడననియు జెప్పుకొనియుండుటచేత నతడీ చోడవంశములోని వాడుగ గుర్తింపబడియెను. వీనిశాసనములపై సింహలాంఛనముగలదు. శాసనపరిశోధకులు వీనిశాసనములం బరిశీలించి రేనాటి చోడులు వ్యాఘ్రలాంఛనముగలవారని వారికిని తంజాపురి తిరుచునాపల్లి చోళులకును సంబంధము గలదని యభిప్రాయబడిన తమమొదటి యభిప్రాయమును మార్చుకొని రేనాటిరెడ్లుగూడ సింహలాంఛనముగలవారేయనియు గాబట్టి రేనాటిచోడులు వేఱనియు, తంజాపురి చోడులు వేఱనియు నభిప్రాయబడియున్నారు. కనుక రేనాటిచోడులను మేమాంధ్రచోడలునుగానే పరిగణించుచున్నారము. తక్కినచోడులనుగూర్చి ద్వితీయసంపుటమునందు వివరముగా వ్రాయదలచి చోడులచరిత్రమిచ్చట ముగించినారము. వీరినిగూర్చిన చరిత్రము పరిశోధనలవలన భావికాలమున దెలిసికొనవలసినదేగాని యింతవఱకు మనకేమియును దెలియరాకున్నయది.
మహాబాణవంశము.
దక్షిణాపథ దేశమును బాలించిన భూపతులలో సూర్యకులులమని కొందఱును చంద్రకులులమని కొందఱును, బ్రహ్మకులులమని కొందఱును, కార్తవీ