Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొకటి గానిపించినది. (No. 352of 1905) చిప్పిలి గ్రామమున గన్పట్టడిన శాసనములో (No.299ofi905) పుణ్యకుమారునిపేరు గానంబడుచున్నది. అత్యనచోళుని శాసనమొకటి గానిపించుచున్నదిగాని (No. 350ofl905)యితడు పశ్చిమచాళుక్యరాజగు నాఱవవిక్రమాదిత్యునికి లోబడిన మండలేశ్వరుడుగాని స్వతంత్రుడుగాడు. అయిన నీతడు పైచోడవంశములోని వాడుగానుండెను. 1907 వ సంవత్సరములోనీచోడులశాసనములు మఱిమూడుగన్పెట్టబడినవి. ఒకటి ముట్టుకూరులోను, ఒకటి ప్రొద్దుటూరులోను మఱియొకటి నల్లచెఱువుపల్లెలోను గనుగొనబడినవి. ఈ గ్రామములన్నియు గడప మండలములోనివే. మొదటిరెండును చోళమహారాజు కాలములోనివి. ఎలచోళ మహారాజుల ముత్తరాజును నిరువురు మూడవశాసనమునం బేర్కొనబడియుండిరి. శ్రీకంఠుని తామ్రశాసనములో ఎలచోళుడు శ్రీకంఠుని పూర్వికులలోని వాడుగా నుదాహారింపబడియుండెను. హేమవతి, నిడుగల్లు ప్రాంతదేశమును బాలించెడు చోళరాజులను గొందఱిని రైసుదొరగారు తుముకూరు శాసనముల సంపుటములో నుదాహరించియున్నారు.[1] వీరిలో ధనుంజయ యెల చోళరాజు గాంగూల పల్లవరాజునకు లోబడిన మండలేశ్వరుడిగ నుండి అల్వాడిదేశమును, చోళికముత్తరాజు కండకోటను పాలించుచుండిరి. వీరలు క్రీ.శ.750దవ సంవత్సరములో నున్నారని రైసుదొరగారు కాలనిర్ణయము చేసియున్నారు.

కడప మండలములోని చోడులు 7000 లుగ్రామములు గలిగిన రేనాడును బాలించుచు దాము కరికాల చోడవంశజులమని చెప్పుకొనియున్నారు. హేమవతి నిడుగల్లుచోడులట్టి ‌‌విషయముల నేమియు జెప్పుకొని యుండలేదు.

రేనాటిచోడులు ద్రావిడచోడులుగారు.

ఈ రేనాటి చోడులు ద్రావిడభాషా వాజ్మయములో వర్ణింపబడిన కరికాలచోడుని వంశములోని వారమని తమశాసనములలో గొప్పగా జెప్పుకొని

  1. Vol Vii, Introduction,p. 7