శార్దూలుడు వానికి పుణ్యకుమారుడు జనించిరి. ఈ పోర్ముఖరామపుణ్యకుమారుడు కోఠి కుల్దరాజుయొక్క కోరికనువిశ్వసించి తనపరిపాలనకాలములో నైదవసంవత్సరమున హిరణ్యరాష్ట్ర మండలములో సుప్రయోగనదియొక్క దక్షిణపుటొడ్డుననున్న బిరిపాఱు (విరిపాడు) గ్రామములో గొంతభూదానము చేసెను. (ఇయ్యది పల్లవయువ మహారాజు విష్ణుగోపని యఱవపల్లి శాసనమునగూడ నుదహరింపబడినది). ఈ పుణ్యకుమారుని పూర్వికులయిన నందివర్మ సింహవిష్ణువుల నామములన పల్లవరాజులచేగూడ వహింపబడియెను మఱియును సుందరానందుడు నవరాముడు చోళనాయకుడయిన శ్రీకంఠుని పూర్వులుగా నుదాహరింపబడిరి.[1]
శిలాశాసనములలో నొకటి పోర్ముఖరామ పుణ్యకుమారునకును, (no.384 of 1904) మూడు చోళమహారాజునకును (ns.405 406,408 of 1904)ఒకటి విక్రమాదిత్యచోళమహారాజునకును (no.400 of 1904) మరియొకటి శక్తివర్మ విక్రమాదిత్యుని కుమారుడగు చోళమహారాజాధిరాజసత్యాదిత్యునకును(No.393 of 1904) సంబంధించినవిగనున్నవి. ఇవన్నియును గడపమండలములోని ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలలో గానుపించినవి గావున వీరి రాజ్యముగూడ నచ్చటిదేయైయుండునని యూహింపబడుచున్నది. ఈ శాసనములలో నుదాహరింపబడిన రాజులలో చోళమహారాజు సూర్యకులడనియు, కాశ్యపగోత్రుడనియు, కరికాలచోడవంశజుడనియు బేర్కొనబడియుండెను. వీరు వహించిన బిరుదునామములంజూడ స్వతంత్రులుగ గన్పట్టుచున్నారు. వీరి శిలాశాసనములు గాని తామ్రశాసనములు గాని వీరేకాలమున నున్నదియు దెలుపుచుండలేదు. వీరిశాసనములలోని లిపిని బట్టిచూడగ 8దవ శతాబ్దమునకు బూర్వమున నున్నవారని తేటపడుచున్నది.
ఇంతియగాక 1904దవ సంవత్సరములో కడపమండలములోని పెద్దముడియ (ముదివేము) మనుగ్రామంబున చోళమహారాజు పాలనములోని శాసన
- ↑ 1.Ep. lnd- vol VI.p. 123 note.