పుట:Andhrula Charitramu Part-1.pdf/388

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వతి ధరణికోట) రెండువందల మైళ్లకు లోపుగనుండి దూరమున మాత్రముండెను. కాబట్టి యీరాజ్యము కడపమండలము లోనిదని చెప్పవచ్చును. హౌనుత్సాంగు వర్ణించిన లక్షణములన్నియు గడపమండలమునకు వర్తించుచున్నవి. క్రీ.శ. 1800 సంవత్సరమున బ్రిటీషువారీమండలమును స్వాధీనము జేసికొను పర్యంతము దారిదోపిడి కాండ్రగుంపులచే నిండియుండి ఘోరకృత్యములకాటపట్టయి యుండెను. ఈదేశమును వర్ణించిన యాత్రికుడు చోళదేశమనిపేర్కొనియెనే గాని రాజ్యపాలనము చేయుచుండిన రాజనైన నుదాహరించినవాడు కాడు. ఈచోళరాజు స్వతంత్రుడో లేకకాంచీపురాధీశ్వరుడయిన నరసింహవర్మయను పల్లవరాజునకు లోబడినవాడో హౌనుత్సాంగు దెలిపియుండిన వాడుకాడు. ఇటీవలనా ప్రాంతముల గనుగొనంబడిన కొన్ని పురాతన శిలాశాసనమును బట్టి హౌనుత్సాంగు చెప్పిన చోళరాజ్యము స్థిరపడుచున్నది. ఎనిమిదవశతాబ్దమునకు బూర్వమునందు వాడుకలోనుండి లిపులను గలిగియుండిన యీచోళరాజుల శాసనములు సంశయములన న్నిటిని నివారించుచున్నవి. 1903-4 వ సంవత్సరములో నీ రాజులయొక్క శిలాశాసనముల లాఱును మఱియొక తామ్రశాసనమును గన్పట్టబడినవి. ఈ తామ్రశాసనములో మొదటకరికాలచోళుడనురాజు పేర్కొనబడియెను. ఇతడు కావేరి నదియొక్క వెల్లువలు దేశమున బొర్లి పాఱకుండ గట్లు పోయించెననియు, పాండ్యచోళచేర రాజ్యములయొక్క యాధిపత్యమును వహించెననియును జెప్పబడియుండెను. వీనివంశమందు సంజవర్మ(?)వుండెను. ఇతడు కాశ్యపగోత్రుడు వీనికి సింహవిష్ణువు, సుందరానందుడు, ధనుంజయవర్మయను మూవురు పుత్రులుండిరి. ధనుంజయవర్మకు చోళమహారాజు వానికి ననిరాముడు, వానికి మహేంద్రవిక్రమవర్మ వానికి ముదితశిలాక్షరుడు కలిగెను. ఇతడు పాండ్యచోళ కేరళరాజ్యముల కధిపతియని చెప్పబడియెను. వీనికి గుణముదితుడు సోర్ముఖరాముడు జనించిరి. సోర్ముఖరామునకు [1] పురుష

  1. No519, Public 18th July 1905 (Rehort on Epiguply)