పుట:Andhrula Charitramu Part-1.pdf/387

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పదునాఱవ ప్రకరణము.

ఆంధ్రచోడులు.

ఏడవశతాబ్ద ప్రారంభమున హౌనుత్సాంగు హిందూదేశంబునందలి బౌద్ధాశ్రమములను జూడవచ్చి దక్షిణ యాత్రచేయునపు డాంధ్రదేశమునకు వచ్చి యచ్చటి బౌద్ధక్షేత్రములను సందర్శించి పిమ్మట ధాన్యకటకమునకు నైఋతి దిక్కుననుండు చుళియ (Chu li-ya) దేశమునకు వెళ్లెనని చెప్పబడియెను. చుళియ చోళకు నామంబగుటజేసి కావేరితీరమునందున్న చోళదేశమిచ్చటికెట్లువచ్చెనని చరిత్రకారు లాశ్చర్యపడుచుండిరి. హౌనుత్సాంగు పరదేశీయుడగుటవలన దెలియక యేదోతప్పుగ వ్రాసెనని యూహించిరి కాని యా కాలమునం దాంధ్రదేశము జోడులమని చెప్పుకొను నొక తెగవారు పరిపాలనము చేయుచుండినది యెవ్వరికి దెలియకపోయెను. హౌనుత్సాంగు చూడవచ్చిన కాలమనగా క్రీ.శ. 640 దవ సంవత్సరమున నీ యాంధ్రదేశములోని యీ చోళరాజ్యము నాలుగైదువందల మైళ్లవిస్తీర్ణము మాత్రము గలిగియుండెను. రెండు మైళ్లుమాత్రమే పరివర్తనము గల యొక చిన్న పట్టణము రాజధానిగనుండెను. దేశమంతయు ననారోగ్యకరంబులగు నడవులతోడను, సారహీనములయిన భూములతోడను, క్రూరకృత్యములచే భయంకరులై మోటుగనుండు ప్రజలతోడను గూడియుండెను. ఎక్కడచూచినను దారిదొంగల గుంపులతో గూడియుండెను. బౌద్ధాశ్రమములు కొన్ని మాత్రమె యుండినవిగాని యవియు శిథిలములై యుండినవి. వానివలెనె యిందునివసించు సన్న్యాసులు గూడ నపరిశుద్ధులుగ నుండిరి. దేశమునందంతటను జైనమతము ప్రచారమునందుండెను. అచ్చటచ్చట బ్రాహ్మణాలయము లత్యల్పసంఖ్యగలవి మాత్రముండినవి. ఈ రాజ్యము ధాన్యకటకమునకు (అమరా