మములోని భీమనాథాలయములో నొక మండపమును గట్టించెను. వీనిమరణానంతరము వీనిసోదరులగు రెండవభీమరాజు మొదటిసత్యరాజు గలిసి పరిపాలనము చేసిరి. వారితరువాత వారి కొడుకులు లోకమహీపాలుడును మూడవభీముడును గలిసి పరిపాలనము చేసిరి. వారికి బిమ్మట రాజేంద్రచోడునికొడుకు మల్లిదేవుడును రెండవరాజపఱేడుకొడుకు వల్లభరాజును గలిసి పరిపాలనము చేసిరి. వల్లభరాజు 14సంవత్సరములు పరిపాలనముచేసినతరువాత మరణము నొందగా వానికొడుకు రెండవమనుమసత్యరాజు వాని స్థానమునకు వచ్చెను. ఈ మల్లిదేవుడును మనుమసత్యరాజునుగలిసి గుద్దవాడివిషయములోని ఒడియూరను గ్రామమును శాలివాహనశకము 1117వ సంవత్సరములో మేష సంక్రాంతినాడు శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయమునకు ధారపోసి యొక శాసనమును వ్రాయించిరి. ఈయెడియూరునకు దూర్పునవేలంగయ దక్షిణమున సిరిపురమున్నదని చెప్పుటచేతను, ఇప్పటి ఓదూరు అనిపిలువంబడు గ్రామమునకు దూర్పున వేలంగి గ్రామమును దక్షిణమున సిరిపుర గ్రామమునుండుటచేతను ఒడియూరే ఓదూరయినదని తలంపబడుచున్నది. ఈ శాసనములో జయమాంబను బొగడునట్టి రెండు శ్లోకములు గానంబడుచున్నవి. ఈజయమాంబ వెలనాటి చోడుడయిన మనుమగొంక రాజుయొక్క భార్యయు, కులోత్తుంగ పృథ్వీశ్వరుని తల్లియునైయుండెను. పృథ్వీశ్వరుని పిఠాపురము శాసనములో నీమెగూర్చి దెలిసికొనియుంటిమి. ఈశాసనమునందీమె పొగడబడియుండుటచేత 1108దవ శకసంవత్సరములోనుండిన జయమాంబ 1117లోగూడ జీవించియున్నదనియు కోనమండలరాజులు వెలనాటిచోడులకు లోబడిన సామంత ప్రభువులనియు దేటపడుచున్నది. ఈ రాజుల చరిత్రమును దెలిపెడివి పిఠాపురశాసనము మాత్రమె గాక మఱికొన్ని శిలాశాసనములు దాక్షారామభీశ్వేరుని యాలయములోను, పాలకొలను(పాలకొల్లు) గ్రామములోని క్షీరారామదేవునియాలయములోనుగలవు. మాహిష్మతీపురంబున కలంకారభూతుడును, కోనమండలాధిపతియు హైహయవంశజుడునుగు రాజపఱేడు కుమారుడును విక్రమరుద్ర బిరుదాంకితుడునైన రాజేంద్రచోడుని శాసనము పై జెప్పిన
పుట:Andhrula Charitramu Part-1.pdf/383
Appearance