Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైహయవంశము.

కోనసీమరాజులు.

చాళుక్యచోడులకును వెలనాటి చోడులకును లోబడి కోనమండలమేలిన రాజవంశమునకు హైహయవంశమనిపేరు. ఇప్పటి గోదావరి డెల్టా భూమియంతయునప్పుడు కోనమండలముగానుండెను. ఇప్పటికిని అమలాపురముతాలూకాకు కోనసీమయను పేరు నిలిచియున్నది. ఈకోనసీమ రాజులశాసనములు 1128 మొదలుకొని 1206వ సంవత్సరము వఱకు గానంబడుచున్నవి. ఇటీవల వారు కొందఱు కాకతీయగణపతులుకుగూడ సామంతులుగానుండరి. ఈ రాజులు తమశాసనములలో దాము యదువంశజుడయిన హరియొక్క మునిమనుమడగు హైనాయుని మనుమడగు కార్తవీర్యుని ‌‌‌వంశములోని వారమని తమశాసనములలో జెప్పుకొనిరి. ఈ‌వంశమునకు మూలపురుషుడయిన ముమ్మడి భీమరాజు మహారాజాధిరాజగు రాజేంద్రచోడదేవునిచే వేంగిదేశ రాజప్రతినిధిత్వము బడసెనని యొక శాసనమున జెప్పబడినది. రాజేంద్రచోడు డనునీమొదటికులోత్తుంగ రాజదేవుడు రాజప్రతినిధిత్వము మొదటి తనపినతండ్రియగు విజయాదిత్యునకును తరువాతా రాజరాజు, వీరచోడుడు, చోడగంగు అనుతన ముగ్గురు కొడుకులకును పిమ్మట వెలనాటిచోడునకును నొసంగెనని మనమెఱంగుదుము. ఈకోనసీమరాజులు రాజప్రతినిధులకులోబడి పరిపాలనము చేసినవారుగా నుండిరి. ఈవంశములో మూడవ వాడయిన రాజపఱేడు కోనమండలాధిపతియని యొకశాసనమునం బేర్కొనంబడియెను. ఈ కోనశబ్దము వీనినామమునకు మాత్రమేగాక మఱికొందఱినామములకు బూర్వమునగానంబడుచుండుటచేత కోనమండలరాజులని పిలుచుటకు సంశయింపబనిలేదు. ఈ వంశములో నైదవరాజయిన రాజేంద్రచోడరాజు తనప్రపితామహుడయిన ముమ్మడిభీమరాజునకొసంగబడిన వేంగిరాజ్యమున కభిషిక్తునైతినని చెప్పుకొనియున్నాడు. వీనికి విక్రమరుద్రుడు హైహయాదిత్యుడు, మొదలగు బిరుదునామములుగలవు. ఇతడు, దాక్షారా